పారిశ్రామిక రంగంలో జపాన్ దేశం ఎప్పుడు ముందుంటుంది. అక్కడి ప్రజలు తోటి వారితో పోటీ పడి మరీ ఎన్ని అద్భుతాలు చేస్తారు. అయితే ఇప్పుడు వారికీ అదే పెద్ద సమస్యగా మారింది. ఆ దేశంలో ప్రతి ఏటా సంతానోత్పత్తి తగ్గిపోతోంది. అక్కడి ప్రజల్లో వైవాహిక బంధం, భార్య భర్తల ఏకాంతం తగ్గిపోవడంతో జననాలపై ప్రభావం పడింది. గత 25 ఏళ్ళ నుంచి జపాన్ వృద్ధుల సంఖ్య పెరుగుతూ..సంతానలేమి ఏర్పడుతోంది. దీన్ని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. పెళ్లి చేసుకునే జంటకు రూ. 4 లక్షలు అందించాలని నిర్ణయించింది. దేశంలో జననాల రేటు పెరగాలంటే యువ జంటలకు నగదు బహుమతి ఆఫర్ చేసింది. చాలా మంది ఆదాయ వేటలో పడి పెళ్లి అనే మాటను మర్చిపోవడంతో ఈ విధంగా చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెళ్లి చేసుకునే జంటలకు రూ. 4 లక్షలు బహుమతి ఇస్తామని ప్రకటించింది. దీనివల్ల కొత్తగా కాపురం పెట్టె జంట ఇంటి అద్దె, ఇతర అవసరాలకు సరిపోతాయని భావిస్తోది. ఇలా చేయడం వల్ల దేశంలో మళ్ళీ జననాల రేటు పెరుగుతుందని పేర్కొంటుంది. అయితే 40 ఏళ్ళ వయసు లోపు ఏడాదికి రూ.5.4 లక్షల జీతం ఉన్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది.
పెళ్లి చేసుకుంటే ₹4లక్షలు ఇస్తారు
Related tags :