Movies

నాలో ఇంకా సత్తా ఉంది

నాలో ఇంకా సత్తా ఉంది

సౌత్లో హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకున్న నిత్యామీనన్ పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఈ ఏడాది ‘మిషన్ మంగళ్’ సినిమాతో బాలీవుడ్కు కూడా ఎంట్రీ ఇచ్చారు. నటిగా ఇప్పటివరకూ ఎన్నో అవార్డులు అందుకున్నారు. అయితే జాతీయ అవార్డు మాత్రం పొందలేకపోయారు. ఈ విషయం గురించి నిత్యామీనన్ మాట్లాడుతూ – ‘‘ఒక నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ప్రేక్షకులు మెచ్చిన మంచి సినిమాలో నేను భాగమై, అందులో నా నటనకు జాతీయ అవార్డు రావాలనుకుంటున్నాను.