ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టులో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు చోటు ఇవ్వకపోవడంపై హర్భజన్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఇప్పటికే గాయాన్ని సాకుగా చూపి రోహిత్ శర్మను పక్కకు పెట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రాగా, సూర్యకుమార్‌ను పరిగణలోకి తీసుకోలేకపోవడాన్ని భజ్జీ ఖండించాడు. ఈ మేరకు ట్వీటర్ వేదికగా టీమిండియా సెలక్షన్ తీరును విమర్శించాడు. ‘ సూర్యకుమార్ ఇంకేమి నిరూపించుకోవాలో తెలియడం లేదు. అతన్ని టీమిండియా జట్టులో ఎంపికయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. సూర్యకుమార్ ప్రతీ ఐపీఎల్లో రంజీ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నాడు. మన సెలక్షన్ కమిటీలో ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన రూల్‌ను అవలంభిస్తున్నారు. ఇందుకు ఇదే నిదర్శనం. సెలక్టర్లు.. కనీసం అతని రికార్డులను చూడండి. ఇది నా రిక్వెస్ట్’ అని భజ్జీ తెలిపాడు.
BCCI కళ్లు తెరవాలి
Related tags :