తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో ప్రవాస మహిళలు చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జి వద్ద బతుకమ్మ ఆడారు. తెలంగాణా సంస్కృతి సంప్రదాయాల్ని మరువకుండా స్థానిక కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వినూత్నంగా చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జి వద్ద బతుకమ్మ ఆట చూడడం గర్వంగా ఉందని టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం అన్నారు. టాక్ కార్యవర్గ సభ్యులంతా వివిధ గ్రూప్ లు గా ఆరుగురికి మించకుండా బతుకమ్మ వేడుకల్ని జరుపుకున్నామని టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది వెల్లడించారు.
లండన్ టవర్ బ్రిడ్జి వద్ద బతుకమ్మ
Related tags :