Movies

రవితో రీతూ

రవితో రీతూ

‘పెళ్లి చూపులు’ చిత్రంతో కుర్రకారు మది దోచుకున్న కథానాయిక రీతూవర్మ. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న ఆమెకు మరో బంపర్‌ ఆఫర్‌ లభించినట్లు టాలీవుడ్‌ టాక్‌. రవితేజ కథానాయకుడిగా రమేశ్‌ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజకీయం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. ఇందులో కథానాయిక కోసం చిత్ర బృందం రీతూ వర్మను సంప్రదించిందని టాక్‌. దర్శకుడు రమేశ్‌ వర్మ ఆమెను కలిసి కథను వినిపించారట. పాత్ర నచ్చడంతో ఆమె కూడా వెంటనే పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అటు రీతూ వర్మ, ఇటు చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.