అన్యోన్యంగా వుండటం అంటే సర్దుకుపోవటమే చక్కటి బంధానికి నిర్వచనం…
పెళ్ళికి ముందు ప్రతి ఒక్కరూ తనకు రాబొయే జీవిత భాగస్వామి ఇలా ఉండాలి…….
ఇలా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటూ ఉంటారు. కానీ పెళ్ళి అయిన తరువాత
జీవితం వేరేగా ఉంటుంది. మన కలలకు అనుగుణంగా లేకపోయే సరికి నిరుత్సాహ
పడిపోతుంటారు. కానీ ప్రతీ ఒక్కరిలోనూ సుగుణాలు ఉంటాయి. లేకపోతే మన ప్రేమతో మనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు………
పెళ్ళి అయిన తరువాత తన జీవిత భాగస్వామిలో తాను కోరుకున్న అంశాలు
కనపడక ఒకరినొకరు సర్ధుకొనక చాలా జీవితాలు నాశనం అవుతున్నాయి.
కొన్ని మంచి గుణాలైనా తప్పక ఉంటాయి. కాబట్టి మిగతావాటిని కూడా
మీ మంచి తనంతో….నడవడికతో ఎదుటివారిలో మార్పు తీసుకునిరావచ్చు,
నచ్చిన మనిషికి నచ్చిన పనులే చేసి మంచిమార్పును ఎదురు చూడవలసిన
పనిలేదు. నచ్చిన మనిషికి నచ్చని పనులు చేయకుండా తనను అనుసరిస్తూ
కూడా మార్పును తీసుకురావచ్చు……అదే నిజమైన జీవితానికి అర్థం……
సర్ధుకునే స్వభావం ఇద్దరిలో ఉంటేనే ఆ సంసారం ఆనందమయం అవుతుంది.
ఎదుటివారిలోపాలను ప్రేమతోనే సరిదిద్ధవచ్చు
సర్దుకుపోవడంలోనే అన్యోన్యత దాగి ఉంది
Related tags :