భారతీయ సంప్రదాయంలో వివాహం అనేది ఒక పవిత్రమైన యజ్ఞం. ఈ క్రతువు ప్రారంభంలో వధువుతో గౌరీపూజ చేయిస్తారు. దంపతులిద్దరూ అరుంధతి నక్షత్రాన్ని దర్శించటంతో ఈ క్రతువు పూర్తవుతుంది. మాంగల్యానికి అధిదేవత ఆమె…సందర్శనం. మాంగల్య సౌభాగ్య సిద్ధికోసం గౌరీపూజ చేయాలని చెబుతారు. గౌరీదేవి మాంగల్యానికి అధిదేవత. ఆమెకు ‘సర్వమంగళా’, ‘మంగళగౌరీ’ అనే పేర్లున్నాయి. గౌరీదేవి భర్త అయిన పరమశివుడు కాలకూట విషం తాగినా ఆమె సౌభాగ్యానికి అంతరాయం కలుగలేదు. తన భర్త విషం స్వీకరించడానికి సిద్ధపడిన వేళలో ఆమె కలవరపడలేదు. వివాహం చేసుకోబోయే వధువు ముందుగా ఆ తల్లిని ఆరాధించడం ద్వారా పరిపూర్ణమైన సౌభాగ్యాలను పొందుతారు.
వధువు గౌరీపూజ ఎందుకు చేస్తుంది?
Related tags :