Sports

23ఏళ్లకే తండ్రి కాబోతున్న జర్మన్ ఆటగాడు!

23ఏళ్లకే తండ్రి కాబోతున్న జర్మన్ ఆటగాడు!

23 ఏళ్ల వయసులోనే జర్మనీ టెన్నిస్‌ ఆటగాడు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ తండ్రి కాబోతున్నాడా?.. అతని మాజీ ప్రేయసి బ్రెండా వ్యాఖ్యల ప్రకారం అది నిజమేనని తెలుస్తోంది. తాను గర్భంతో ఉన్నానని, దానికి కారణం జ్వెరెవ్‌ అని.. ఈ ఏడాది ఆగస్టులో అతని నుంచి విడిపోయిన 27 ఏళ్ల బ్రెండా వెల్లడించింది. ఈ జోడీ ఓ ఏడాది పాటు సహజీవనం చేసింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో బ్రెండా మాట్లాడుతూ.. ‘‘నేనిప్పుడు 20 వారాల గర్భవతిని. జ్వెరెవ్‌ కారణంగానే బిడ్డకు జన్మనివ్వబోతున్నా. జీవితంపై మాకు విభిన్న ఆలోచనలు ఉండడంతో కలిసి ఉండలేక విడిపోయాం. పుట్టబోయే బిడ్డను అతని దగ్గర ఉంచను. సొంతంగా బిడ్డ బాధ్యతను చూసుకునే స్థాయిలో ఉండడం నా అదృష్టం’’ అని ఆమె పేర్కొంది. ఈ ఏడాది యుఎస్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన జ్వెరెవ్‌.. బ్రెండా వ్యాఖ్యలపై ఇంకా స్పందించలేదు.