DailyDose

మృత్యుబావి కేసులో సంజయ్‌కు ఉరిశిక్ష-నేరవార్తలు

Crime News - Warangal Murderer Gets Hanging Verdict

* తెలంగాణలో సంచలనం సృష్టించిన తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది మే 20న వరంగల్‌ నగర శివారులోని గొర్రెకుంట బావిలో 9మందిని హత్య చేసిన కేసులో విచారణ పూర్తయింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నిందితుడిపై అభియోగాలను నిరూపించడంతో ఉరిశిక్ష ఖరారు చేస్తూ వరంగల్‌ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జయకుమార్‌ తీర్పు వెల్లడించారు. నిందితుడిపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటన జరిగిన నెల రోజుల్లోనే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయడం గమనార్హం. నిందితుడికి ఉరిశిక్ష పడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు

* జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదుల డంప్‌ను బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నాయి.మెహంద‌ర్‌లోని క‌లాబ‌న్ ఏరియాలో ఆర్మీ, స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూప్ బ‌ల‌గాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వ‌హించాయి.నిన్న రాత్రి క‌లాబ‌న్ ఏరియాలో ఉగ్ర‌వాదుల‌కు సంబంధించిన భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నాయి.

* కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సెక్స్ ​వర్కర్లకు ఉచిత రేషన్​ పంపిణీ చేయలని జారీ చేసిన ఉత్తర్వులపై సమ్మతి నివేదికను సమర్పించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది సుప్రీంకోర్టు.

* గుంటూరు జిల్లా జైలు వద్ద ఆందోళన.అమరావతి రైతులకు బేడీలు వేయటంపై టిడిపి, సిపిఐ, అమరావతి జేఏసి నిరసన.ఆందోళనలో పాల్గొన్న టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజా, టిడిపి నేతలు తెనాలి శ్రావణ్ , కోవెలమూడి రవీంద్ర , పిల్లి మాణిక్యరావు, సిపిఐ నేత రామకృష్ణ.