Movies

నాకు సినిమా వ్యాపారం కాదు

నాకు సినిమా వ్యాపారం కాదు

సినిమాను వ్యాపారధృక్కోణంతో తాను ఎన్నడూ చూడనని అంటోంది అనుష్క. ఆన్‌స్క్రీన్‌ మ్యాజిక్‌ను, సంతోషాన్ని ప్రతిక్షణం ఆస్వాదించడానికే ప్రయత్నిస్తానని అంటోంది. ‘సూపర్‌’సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసిన అనుష్క చిత్రసీమలో అడుగుపెట్టి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో ప్లాన్‌ చేస్తూ తానెప్పుడూ సినిమాలు చేయలేదని తెలిపింది. మనసు చెప్పిన మాటలకు కట్టుబడుతూ ముందుకుసాగానని తెలిపింది. అనుష్క మాట్లాడుతూ ‘వ్యాపార కోణంలో ఆలోచించి ఇప్పటివరకు సినిమాల్ని అంగీకరించలేదు. ఆ లెక్కలు నాకు తెలియవు. నా కెరీర్‌కు ఎంత ఉపయోగపడుతుంది? పేరుప్రఖ్యాతలు తీసుకొస్తుందా?లేదా? అనేవి పట్టించుకోను. నా మనసుకు నచ్చితే చాలనుకుంటాను. అంతకుమించి ఏదీ కోరుకోను. ఎలాంటి ప్రణాళికలు వేసుకోకుండా సినిమాల్లో నటిస్తుంటా. ఆ ఆలోచనా విధానమే నాకు విజయాల్ని తెచ్చిపెట్టింది. డబ్బు, స్టార్‌డమ్‌ ఇవ్వలేని సంతృప్తి, ఆనందాన్ని ఈ సక్సెస్‌లతో పొందగలిగా’ అని తెలిపింది.