కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి లక్ష అమెరికన్ డాలర్లను జమ చేసిన ప్రవాస భారతీయుడు…
చిత్తూరు :
పూతలపట్టు నియోజకవర్గం,
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థాన చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఓ ప్రవాస భారతీయుడు దేవస్థానం ఖాతాకు బుధవారం రూ. లక్ష అమెరికన్ డాలర్లను విరాళంగా జమచేశారు.
ఈ డాలర్ల విలువ ఇండియన్ కరెన్సీతో పోలిస్తే రూ. 72,88,877/- (72 లక్షల, 88 వేల, 877 వందల) రూపాయలతో సమానమని అధికారులు పేర్కొన్నారు.
ఈ విరాళాన్ని భక్తిని కోరిక మేరకు అన్నదాన ట్రస్ట్ నకు 50 వేల డాలర్లను, గోసంరక్షణ ట్రస్టుకు 50 వేల డాలర్లను ఆలయం ఖాతాలో జమ చేసారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకటేశులు మాట్లాడుతూ..
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామివారి ఆశీస్సులతో ఓ ప్రవాస భారతీయుడైన భక్తుడు తన వ్యాపార రంగంలో ప్రగతి సాధించడంతో ఈ విరాళ రూపంలో వినాయక స్వామివారికి మొక్కుబడులు తీర్చుకున్నట్లు తెలిపారు. స్వామివారికి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం కాణిపాక ఆలయ చరిత్రలో ఇదే ప్రథమమని ఈ సందర్భంగా విరాళం ఇచ్చిన అజ్ఞాత భక్తుడిని మీడియా తరఫున అభినందించారు.
ఇదే విధంగా ఆలయ అభివృద్ధికి విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
విరాళాలు ఇవ్వవలసిన వారు శ్రీ కాణిపాక దేవస్థానం కార్యాలయంలో సంప్రదించాలని, లేనిపక్షంలో దాతల కోరికమేరకు..
అన్నదానం బ్యాంకు ఖాతా :
SBI A/c No : 30178925930,
IFSC Code # SBIN0010105 Through Phone Pay, Google Pay, Pay TM : UPI ID : eossvvsda@sbi Online ద్వార Transfer చేసిన వారు వారి యొక్క transaction details వారి పూర్తి పేరు, గోత్ర నామాలు, చిరునామా మరియు జరపవలసిన తేదీ, ఈ క్రింది email id : kanipakam_eo@yahoo.com ద్వారా..
మరియు
శ్రీ సిద్ధి వినాయక గోసంరక్షణ ట్రస్ట్ బ్యాంక్ ఖాతా :
SBI A/c No : 39570342912,
IFSC Code # SBIN0010105. Through Phone Pay, Google Pay, Pay TM :
UPI ID : EOSSVVSDSVGST@SBI Online ద్వార Transfer చేసిన వారు వారి యొక్క transaction details వారి పూర్తి పేరు, గోత్ర నామాలు, చిరునామా మరియు జరపవలసిన తేదీ, ఈ క్రింది email id : kanipakam_eo@yahoo.com ద్వారా పంపవచ్చునని తెలిపారు.