DailyDose

జగన్ అక్రమాస్తుల కేసు నవంబర్2కు వాయిదా-నేరవార్తలు

జగన్ అక్రమాస్తుల కేసు నవంబర్2కు వాయిదా-నేరవార్తలు

* సీబీఐ కేసులను ముందు విచారించండిజగన్​ అక్రమాస్తుల కేసుల వ్యవహారంపై సీబీఐ కోర్టులో బుధవారం విచారణ జరిగింది.జగన్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.సీబీఐ ఛార్జిషీట్లను తేల్చిన తర్వాతే ఈడీ కేసులపై విచారణ జరపాలని కోరారు.మద్యం సిండికేట్​ కేసులో అనిశా న్యాయస్థానం సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది.తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.జగన్ అక్రమాస్తుల కేసుల వ్యవహారంపై హైదరాబాద్​లోని సీబీఐ కోర్టులో బుధవారం విచారణ జరిగింది.సీబీఐ ఛార్జిషీట్లను తేల్చిన తర్వాతే ఈడీ కేసులపై విచారణ జరపాలని జగన్ తరఫు న్యాయవాది నిరంజన్​ రెడ్డి కోర్టును కోరారు.సీబీఐ అభియోగ పత్రాల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు.గతంలో 2జీ కుంభకోణం కేసులో సీబీఐ కేసు వీగిపోయాక.. ఈడీ కేసుపై న్యాయస్థానం విచారణే జరపలేదని వాదించారు.ఈ కేసులపై ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయి.రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తదితరులు నిందితులుగా ఉన్న మద్యం సిండికేట్ కేసులో ఏసీబీన్యాయస్థానంలో వాంగ్మూలాల నమోదు ప్రక్రియ కొనసాగింది.తదుపరి విచారణ ఏసీబీ కోర్టు నవంబరు 2కి వాయిదా వేసింది.

* ఉగ్ర ఎన్​జీఓ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది ఎన్​ఐఏ. అందులో భాగంగా వరుసగా రెండో రోజు సోదాలు నిర్వహించింది.

* కశ్మీర్​లో భూములను దేశంలోని ఎవరైనా కొనుగోలు చేసేలా చట్టాల్లో మార్పులు చేయటం సహా ఎన్​జీఓలు, ట్రస్టుల్లో ఎన్​ఐఏ సోదాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగింది పీపుల్స్​ డెమొక్రాటిక్​ పార్టీ(పీడీపీ).

* పాలెం చెక్‌పోస్టు వద్ద భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న నిందితులు పరారయ్యారు.

* విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఎల్జీ పాలిమర్స్ పిటిషన్‌ను జస్టిస్ లలిత్ ధర్మాసనం విచారించింది.ఎల్జీ పాలిమర్స్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.ఎన్జీటీ సుమోటోగా కేసు తీసుకోవడంపై ఎల్జీ పాలిమర్స్ అభ్యంతరం వ్యక్తంచేసింది.ఎన్జీటీలో కేసు విచారణ నవంబర్ 3న ఉందని ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు.ఎన్జీటీలో కమిటీ నివేదికపై అభ్యంతరాలను సమర్పించాలని ఎల్జీ పాలిమర్స్‌ను సుప్రీం ఆదేశించింది.10 రోజుల్లో నివేదికపై అభ్యంతరాలను ఎన్జీటీతో పాటు సుప్రీంకు సమర్పించాలని ధర్మాసనం చెప్పింది.సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాల వరకు ఎన్జీటీలో కేసు విచారణ వాయిదా వేయాలని సూచించింది. తదుపరి విచారణ నవంబర్ 16కు వాయిదా వేసింది.

* జగయ్యపేట మండల గరికపాడు చెక్ పోస్ట్ వద్ద టాటా ఎసి వాన్ లో తెలంగాణ నుండి తెనాలి కి తరలిస్తున్న 604 మద్యం బాటిల్స్ పట్టివేత.

* హనుమాన్ జంక్షన్ వద్ద 16వ జాతీయ రహదారిపై ప్రమాదం..లారీని డీ కొన్న కారు, మహిళ మృతి, మరో ముగ్గురికి గాయాలు..హైద్రాబాద్ నుంచి రాజమండ్రి వెళుతుండగా ఘటన. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉద్యోగి కుటుంబఒగా గుర్తింపు..క్షతగాత్రులను విజయవాడ కామినేని ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బంది.