Fashion

మహిళలు ఈ చట్టాలు మీకోసమే!

మహిళలు ఈ చట్టాలు మీకోసమే!

మహిళలు… ఈ చట్టాలు గురించి తెలుసుకోవలి.

సమాజంలో మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే మహిళా రక్షణ కోసం మన రాజ్యాంగం ఎన్నో చట్టాలు, ఐపీసీ సెక్షన్లను కల్పించింది. వాటిపై మహిళలకు అవగాహన లేకపోవడంతో వారు ఎంతో నష్ట పోతున్నారు.

ఈ నేపథ్యంలోనే వారికి రాజ్యాంగం కల్పించిన కొన్ని చట్టాలు, ఐపీసీ సెక్షన్ లను చూద్దాం…

సెక్షన్ 100: ఆత్మరక్షణ కోసం ఎదుటి వారిపై దాడి చేస్తే తప్పులేదు. ఆ సమయంలో సదరు వ్యక్తి చనిపోయినా శిక్ష పడదు.

సెక్షన్ 116(బి): ఈ సెక్షన్ ప్రకారం బాధితురాలికి ప్రభుత్వ, ప్రైవేట్, ఆస్పత్రిలో చికిత్స ఇవ్వకపోతే సిబ్బంది, యాజమాన్యం మీద కేసు వేయవచ్చు.

సెక్షన్ 228(ఏ): అత్యాచారానికి గురైన మహిళ అనుమతి లేకుండా మీడియాలో ఆమె పేరు, ఫోటోలు ప్రచురించారు. అలా చేస్తే ప్రచురించిన, ప్రసారం చేసిన సంస్థలపై చర్యలు తీసుకోవచ్చు.

సెక్షన్ 354: స్త్రీ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, అవమానపరిచినా, అనుమతిలేకుండా ఫోటో, వీడియో తీసినా ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయవచ్చు సెక్షన్ కింద ఫిర్యాదు చేయవచ్చు.

సెక్షన్ 376: 18 ఏళ్ల లోపు ఉన్న యువతితో సెక్స్ లో పాల్గొంటే నేరం. ఒకవేళ ఆమె ఇష్ట ప్రకారమే చేసినా సదరు పురుషుడికి ఈ సెక్షన్ కింద ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష పడుతుంది.

సెక్షన్ 376: వైద్యం కోసం వచ్చిన మహిళను లైంగికంగా వేధిస్తే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు.

సెక్షన్ 494: భార్య ఉండగా మరొకరిని పెళ్ళి చేసుకోవడం నేరం. ఇందుకుగాను సంబంధిత వ్యక్తికి ఏడేళ్లు జైలు కాయం.

సెక్షన్ 498(ఏ): వివాహితను ఆమె భర్త గాని, భర్త బంధువులు గాని, శారీరకంగా, మానసికంగా హింసించినా, అందుకు ప్రేరేపించినా, ప్రోత్సహించినా ఈ సెక్షన్ కింద కేసు వేయావచ్చు. కనీసం మూడేళ్లు జైలు శిక్ష తో పాటు జరిమానా కట్టాల్సి వస్తుంది.

సెక్షన్ 509: మహిళలతో అవమానంగా మాట్లాడినా, వేధించిన సైగలు చేసినా ఈ చట్టం ప్రకారం శిక్షకు అర్హులు.

సెక్షన్ 294: రోడ్ల మీద నడుస్తుంటే, బస్ స్టాఫ్ లు ఇంకెక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు అసభ్యంగా పాటలు పాడుతూ… ఎవరినైనా ఇబ్బంది పెడితే ఈ సెక్షన్ ప్రకారం వారి పై కేసు నమోదు చేయవచ్చు. జరిమానాతో పాటు కనీసం మూడు నెలలు జైలు శిక్ష కూడా పడుతుంది.

సెక్షన్ 499: ఫోటోలను మార్పింగ్ చేసి ఇబ్బంది కరంగా ఇంటర్నెట్లో పెడుతున్నా ఘటనలు ఈ మధ్య బాగా వెలుగు చూస్తున్నాయి. ఇలాంటివి మీకు ఎదురైతే ఈ సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. నేరం రుజువైతే సదరు వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది.

సెక్షన్ 366: స్త్రీలు, బాలికలను బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుంటే పదేళ్లు జైలు శిక్షతోపాటు జరిమానా పడుతుంది..??????