బాలీవుడ్ తోపాటు దక్షిణాది సినిమాల్లో కూడా నటించి మెప్పించింది హీరోయిన్ సమీరా రెడ్డి. పెళ్లి అనంతరం వెండితెరకు దూరమై పూర్తి గృహిణిగా మారిపోయింది. అయితే సమీర మళ్లీ సినిమాలు చేయబోతోందంటూ కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తమిళ సినిమాలో సమీర నటిస్తోందంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఈ వార్తలపై తాజాగా సమీర స్పందించింది. `నేను సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నాను అంటూ వస్తున్న వార్తలు అవాస్తవాలు. ప్రస్తుతం నేను కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. సినిమాల్లో నటించడం గురించిన ఆలోచనే లేద`ని సమీర పేర్కొంది.
నేను రావట్లేదు
Related tags :