“సర్దార్ పాపారాయుడు” చిత్రం విడుదల అయ్యి నేటికి40..సంవత్సరాలు పూర్తి చేసుకుంది. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు నటించిన సినిమాలలో “సర్దార్ పాపారాయుడు” ఒక ప్రఖ్యాతమైనది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1980వ సం.లో శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ చిత్రంలో రామారావు తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం ధరించి ప్రేక్షకులను అలరించారు. 1981లో ఊటీలో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగు విరామసమయంలో ఒక విలేఖరి, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా? ఆని అడిగాడు. దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజునుంచి నా వంతుగా ప్రతీనెలలో 15రోజులు తెలుగుప్రజల సేవకోసం కేటాయిస్తాను అని చెప్పాడు. ఆయన చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం.అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వరత్వరగా పూర్తి చేసాడు….1982 మార్చి 29 సాయంత్రము 2:30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పాడు. ఆసమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటించాడు.
“సర్దార్ పాపారాయుడు”కి 40 ఏళ్లు
Related tags :