రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి ఎన్నారైలు మద్దతు ప్రకటించారు. శనివారం ఉదయం 10గంటలకు nrisforamaravati.org పేరిట ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ను అమరావతి రైతు ఉద్యమ మహిళలు శ్రీలక్ష్మీ, కుక్కుమళ్ల పిచ్చమ్మలు ప్రారంభించారు. కోమటి జయరాం మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యమానికి, ఉద్యమకారులకు, అమరావతి స్థానికులకు ఎన్నారైల మధ్య ఈ వెబ్సైట్ వారధిగా పనిచేస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో డా.కొడాలి శ్రీనివాస్, చందు గొర్రపాటి, సతీశ్ వేమన, ఠాగూర్ మలినేని, సాయి, రత్న ప్రసాద్, రాజా, ప్రసాద్, చందు, నాగ, శ్రీనివాస్, కలపటపు బుచ్చి రామ్ ప్రసాద్, కృష్ణా గంపా, ప్యాలా ప్రసాద్, రజనీకాంత్, శ్రీమంత్, శివశంకర్, గంగాధర్, శ్రీనివాస్ గుత్తికొండ, మోహన్‌కృష్ణ మన్నవ, శ్రీధర్ అప్పసాని, కిశోర్ కంచెర్ల, సంపత్ కామినేని, శ్యాం మద్దాలి, విజయశేఖర్ అన్నే, డాక్టర్ మధు కొర్రపాటి, డాక్టర్ రవీంద్ర ఆలపాటి, శ్రీనివాస మంచికలపూడి, ప్రసాద్ చుక్కపల్లి, అంజయ్య చౌదరి లావు, డాక్టర్.అప్పారావు ముక్కాముల, ప్రశాంత్ పిన్నమనేని, గంగాధర్ నాదెళ్ల, రవి మందలపు, సురేష్ పుట్టగుంట, సతీష్ వేమూరి, చుక్కపల్లి ప్రసాద్, మురళి వెన్నం, చలపతి కొండ్రగుంట, శ్రీనివాస లావు, సత్యనారాయణ వాసిరెడ్డి తదితరులు పాల్గొని ఉద్యమానికి తమ సంఘీభావాన్ని తెలిపారు.
https://www.nrisforamaravati.org/