ScienceAndTech

గొరిల్లా గ్లాస్ రహస్యాలు

గొరిల్లా గ్లాస్ రహస్యాలు

ఫోన్‌ స్ర్కీన్‌లు డామేజ్‌ కాకుండా రక్షించడం కోసం కార్నింగ్‌ అనే సంస్థ ప్రత్యేకంగా తయారు చేసిన గ్లాస్‌నే గొరిల్లా గ్లాస్‌ అంటారు. వేలాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఫోన్లను జేబులో పెట్టుకున్నప్పుడు కీచెయిన్ల లాంటివీ, కాయిన్ల లాంటివీ తగిలి గీతలు పడితే ప్రాణం చివుక్కుమంటుంది కదా. అంతేకాదు, పొరబాటున టేబుల్‌ మీద నుంచి ఫోన్‌ కింద పడితే స్ర్కీన్‌ పాడయ్యే అవకాశం ఉంది. అలాంటి ప్రమాదాలను తప్పించడానికి ఈ ప్రత్యేకమైన గ్లాస్‌ ఉపయోగపడుతుంది.ఉదాహరణకు ఇటీవల ప్రవేశపెట్టిన గొరిల్లా గ్లాస్‌ 5నే తీసుకుంటే 1.6 మీటర్ల ఎత్తు నుంచి ఫోన్‌ని కింద పడేసినా చెక్కుచెదరకుండా ఇది కాపాడుతుంది. అనేక రకాల శక్తిమంతమైన పరీక్షలు చేసిన తరవాత మాత్రమే కార్నింగ్‌ సంస్థ దీన్ని తయారు చేస్తోంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, టెలివిజన్‌ స్ర్కీన్లలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు.