Business

టయోటా వాహనాలు భారీగా కొనుగోలు చేసిన భారతీయులు

టయోటా వాహనాలు భారీగా కొనుగోలు చేసిన భారతీయులు

టొయోటా దేశీయ విక్రయాల్లో 52 శాతం వృద్ధి సాధించింది. సెప్టెంబర్‌లో ఈ సంస్థకు 8116 వాహనాలు అమ్ముడుపోయాయి. పండుగ సీజన్‌ ఈ సారి టొయోటాకు బాగా కలిసి వచ్చింది. మొత్తం 12,373 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే పండుగ సీజన్‌లో 11,866 వాహనాలను మాత్రమే విక్రయించింది. ఈ సారి 744 కార్లను ఎగుమతి చేసింది. కొవిడ్‌ షాక్‌ తర్వాత టొయోటా మెల్లగా పుంజుకుంటోంది. గత ఐదు నెలలుగా విక్రయాలు మెరుగవుతున్నాయి. కంపెనీ టోకు విక్రయాల్లో ప్రతినెలా 50శాతం వృద్ధిరేటు నమోదు చేస్తూ వస్తోంది. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్లు పాజిటివ్‌ వృద్ధిరేటును నమోదు చేస్తున్నాయి. గత నెల నుంచి అర్బన్‌ క్రూయిజర్‌ విక్రయాలు కూడా ప్రారంభించడం కలిసి వచ్చింది. ‘‘మార్చి 2020 ఇదే అత్యుత్తమ విక్రయాలు. మాకు పండుగ సీజన్‌ కలిసొచ్చింది. ప్రతినెలా విక్రయాల్లో వృద్ధి కనిపిస్తోంది’’ అని కంపెనీ విక్రయాల విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ నవీన్‌ సోనీ పేర్కొన్నారు.