సోయా ఉత్పత్తులు ఎక్కువగా తినేవాళ్లలో డిమెన్షియా తక్కువగా ఉన్నట్లు పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయ నిపుణులు పేర్కొంటున్నారు. జపాన్‌లో తొంభై సంవత్సరాలు దాటిన వృద్ధుల్ని పరిశీలించినప్పుడు- వాళ్ల పొట్టలో వైవిధ్యభరితమైన బ్యాక్టీరియా ఉత్పత్తికి సోయా దోహదపడుతున్నట్లు గుర్తించారు. ఆ బ్యాక్టీరియా నేరుగా మెదడు మీద ప్రభావం చూపిస్తుందనీ ముఖ్యంగా మతిమరపుకి కారణమయ్యే వైట్ మ్యాటర్ లెజియన్స్ సంఖ్యను తగ్గిస్తుందనీ గుర్తించారు. ఎందుకంటే వీటి సంఖ్య ఎంత తక్కువగా ఉంటే జ్ఞాపకశక్తి అంత బాగుంటుంది. వీటి సంఖ్య పెరిగితే, మెదడు చురుకుదనానికి కారణమయ్యే ఈక్వల్ ఉత్పత్తి తగ్గిపోతుందట. దాంతో మతిమరపు, ఆల్జీమర్స్ వంటివి వచ్చే అవకాశం ఉంది. అదే వైట్‌మ్యాటర్ తక్కువగా ఉన్నవాళ్లలో మెదడులో ఈక్వల్ ఉత్పత్తి ఎక్కువగా ఉందట. దీనికి సోయా వాడకమే కారణమని తేల్చారు. అదెలా అంటే- సోయా ఎక్కువగా తినడం వల్ల వాళ్ల పొట్టలో ఒక రకమైన బ్యాక్టీరియా చేరుతుంది. అది కాస్తా సోయాలోని ఐసోఫ్లేవొనిన్లని మెదడు పనితీరుకి కారణమయ్యే ఈక్వల్‌గా మారుస్తుంది. అందువల్లే ప్రపంచదేశాలతో పోలిస్తే జపనీయుల్లో మతిమరపు తక్కువ అంటున్నారు. పైగా సోయాలోని ఐసోఫ్లేవనిన్ల కారణంగా వాళ్లలో గుండెజబ్బులూ తక్కువేనట.
సోయా తింటే సర్వం గుర్తుంటాయి!
Related tags :