Business

నవంబరులో బ్యాంకు సెలవులు ఇవి-వాణిజ్యం

నవంబరులో బ్యాంకు సెలవులు ఇవి-వాణిజ్యం

* నవంబర్ నెలలో బ్యాంకులకు 8 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. ప్రభుత్వ సెలవులతో పాటు పండుగల సందర్భంగా బ్యాంకులకు ఎనిమిది రోజుల పాటు సెలవులు ప్రకటించారు బ్యాంకు అధికారులు. నవంబరు నెలలో ఐదు ఆదివారాలు, రెండు శనివారాలు వచ్చాయి. దీనితో పాటు దీపావళి, గురునానక్‌ జయంతి సెలవులు కూడా రావడంతో నవవంబర్ నెలలో బ్యాంకులు 8 రోజులు వర్క్ చేయవు. ఖాతాదారులు సెలవు రోజుల్లో ఆన్‌లైన్‌ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాలను వినియోగించుకోవాలని బ్యాంకు అధికారులు తెలిపారు.

బ్యాంకు సెలవులు…
..నవంబర్ 1- ఆదివారం
..నవంబర్ 8- ఆదివారం
..నవంబర్ 14- రెండో శనివారం, దీపావళి
..నవంబర్ 15- ఆదివారం
..నవంబర్ 22- ఆదివారం
..నవంబర్ 28- నాలుగో శనివారం
..నవంబర్ 29- ఆదివారం
..నవంబర్ 30- గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి

* కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్‌ – తెలంగాణ రాష్ట్రాల మధ్య నిలిచి పోయిన ఆర్టీసీ బస్సు సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏపీలో 1,61,258 కి.మీ. మేర టీఎస్‌ ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. ఇక తెలంగాణలో 1,60,999 కి.మీ. మేర 638 బస్సులను ఏపీఎస్‌ ఆర్టీసీ నడపనుంది.ఏపీ, తెలంగాణల మధ్య అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసుల సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీలు ఏయే మార్గాల్లో ఎన్ని సర్వీసులు నడపాలో స్పష్టత వచ్చింది. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో అవగాహన ఒప్పందంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబు మాట్లాడుతూ.. ‘‘మార్చి 22న కరోనా కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్ర నిబంధనల ప్రకారమే బస్సులు నడిపాం. ఇప్పుడు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల ఒప్పందం ప్రకారం ఆర్టీసీ బస్సులు నడపబోతున్నాం. ఆర్టీసీతో పాటు గూడ్స్ ఇతర రవాణా వాహనాలు పునరుద్ధరిస్తాం. త్వరలోనే ఇంటర్ స్టేట్ టాక్స్ పేమెంట్ కోసం ఇరు రాష్ట్రాల మంత్రుల భేటీ ఉంటుంది. రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని అంటే స్పిరిట్ ఆఫ్ స్టేట్ ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాలు 1లక్ష కిలోమీటర్లు నడపాలంటే కష్టమే. ఎందుకంటే కరోనా పరిస్థితులు చక్కబడి సాధారణ స్థితికి రావడానికి మరో ఆరు నెలల సమయం పట్టవచ్చు. ఒక వేళ లక్ష కిలోమీటర్లు ఇరు రాష్ట్రాలు తిప్పకపోతే మళ్లీ పునరాలోచన చేయాల్సి ఉంటుంది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బస్సులను నడపాలని ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకుంటున్నాము’’ అని తెలిపారు. అనంతరం తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడారు. ‘‘సమయం తీసుకున్నా… సమగ్రమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ఏపీ రవాణాశాఖ మంత్రికి అభినందనలు తెలియజేస్తున్నా. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ లేదనే విషయం కరోనా రావడం వల్లే తెలిసింది. ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం వల్ల ఏపీఎస్ ఆర్టీసీకి లాభమే. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీ , తెలంగాణల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అందుకే అగ్రిమెంట్ చేసుకున్నాం. ఈ రోజు రాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు.. రెండు రాష్ట్రాల మధ్య నడుస్తాయి. టీఎస్ ఆర్టీసీకి ఛార్జీలు పెంచే ఆలోచన లేదు. ఆర్టీసీల మధ్య చర్చలు ఆలస్యం అవ్వడం వల్ల… ప్రైవేట్ ట్రావెల్స్‌కు లాభం చేకూరుస్తుందనే మాట వాస్తవం కాదు. తెలంగాణ ఆర్టీసీకి రెవెన్యూ నష్టం రూ.2వేల కోట్లు కాగా, ఏపీ ఆర్టీసీకి రూ.2400కోట్ల నష్టం వచ్చింది’’ అని అన్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణకు నిత్యం 1,009 సర్వీసులు నడిపేది. ఇప్పుడు ఆ సంఖ్య 638కే పరిమితమైంది. దీంతో 371 సర్వీసులు తగ్గనున్నాయి. టీఎస్‌ఆర్టీసీ గతంలో ఏపీకి 750 సర్వీసులు నడిపేది. ఇప్పుడు 820 వరకు పెరగనున్నాయి. టీఎస్‌ఆర్టీసీ డిమాండు మేరకు 1.61 లక్షల కి.మీ.మేర సర్వీసులకే ఏపీఎస్‌ ఆర్టీసీ అంగీకరించడంతో ఆర్టీసీల ఎండీల మధ్య సోమవారం ఒప్పందం జరిగింది. అయితే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బస్సుల పర్మిట్లపై గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి, ఉభయ రాష్ట్రాల రవాణాశాఖల ముఖ్య కార్యదర్శుల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగేందుకు మరికొంత సమయం పడుతుందని ఏపీ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు, టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ తెలిపారు.

* యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌‌‌‌‌‌‌‌ఫేస్ (యూపీఐ) ట్రాన్సాక్షన్స్ సరికొత్త మైలురాయిని తాకాయి. అక్టోబర్ నెలలో 207 కోట్ల ట్రాన్సాక్షన్స్ నమోదైనట్టు తాజా డేటాలో వెల్లడైంది. ఈ ట్రాన్సాక్షన్స్ వాల్యూ రూ.3.3 లక్షల కోట్లుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌‌‌‌పీసీఐ) డేటా తెలిపింది. యూపీఐ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌పై 189 బ్యాంక్‌‌‌‌లు లైవ్‌‌‌‌గా తమ సేవలందిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో రూ.3.29 లక్షల కోట్ల విలువైన 180 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. పర్సన్ నుంచి పర్సన్‌‌‌‌కు, పర్సన్ నుంచి మర్చెంట్‌‌‌‌కు మనీ ట్రాన్స్‌‌‌‌ఫర్ చేసే విషయంలో యూపీఐ చాలా మార్పులు తీసుకొచ్చింది. సెక్యూర్‌‌‌‌‌‌‌‌గా ట్రాన్సాక్షన్స్‌‌‌‌ జరుపుకునేలా సహకరిస్తోంది. గతేడాది అక్టోబర్ నెలలో యూపీఐ లావాదేవీలు 100 కోట్ల మార్క్‌‌‌‌ను తాకాయి. 2017లో ఇది లాంచ్ అయినప్పటి నుంచి ప్రతి నెలా యూపీఐ లావాదేవీల వాల్యూమ్ పెరుగుతూ వస్తోంది. అయితే కరోనా అవుట్‌‌‌‌బ్రేక్‌‌‌‌తో దేశంలో లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ విధించడంతో ఏప్రిల్–మేలలో యూపీఐ లావాదేవీలు కాస్త తగ్గాయి. జూన్ నుంచి మళ్లీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ రికవరీ సాధించాయి.

* దేశంలో మరో 14 వాటర్‌‌‌‌‌‌‌‌ ఏరోడ్రోమ్‌‌‌‌లను డెవలప్‌‌‌‌ చేయాలని ప్రభుత్వం ప్లాన్స్‌‌‌‌ వేస్తోంది. ప్రధాని మోడీ శనివారం ప్రారంభించిన సీప్లేన్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లకు మంచి డిమాండ్‌‌‌‌ ఉండడంతో ఈ ట్రాన్స్‌‌‌‌ఫోర్ట్‌‌‌‌ విధానాన్ని మరింత డెవలప్ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. సీప్లేన్‌‌‌‌లు ల్యాండ్‌‌‌‌ అయ్యే లొకేషన్లను వాటర్‌‌‌‌‌‌‌‌ ఏరోడ్రోమ్‌‌‌‌లని అంటారు. లక్షదీప్‌‌‌‌, అండమాన్ నికోబార్‌‌‌‌‌‌‌‌, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖాండ్‌‌‌‌ వంటి రూట్‌‌‌‌లలో సీప్లేన్‌‌‌‌లను నడిపేందుకు ఈ వాటర్‌‌‌‌‌‌‌‌ ఏరోడ్రోమ్స్‌‌‌‌ ఉపయోగపడతాయని ప్రభుత్వం అంచనావేస్తోంది. రీజినల్‌‌‌‌ కనెక్టివిటీ స్కీమ్‌‌‌‌ ఉడాన్‌‌‌‌ కింద 1 4 వాటర్‌‌‌‌‌‌‌‌ ఏరోడ్రోమ్స్‌‌‌‌ను ప్రభుత్వం డెవలప్‌‌‌‌ చేయాలనుకుంటోందని షిప్పింగ్‌‌‌‌ మినిస్ట్రీ అధికారులు చెప్పారు. దేశంలో హైడ్రోగ్రాఫిక్‌‌‌‌ సర్వేను జరపాలని ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌ అథారిటీ(ఏఏఐ), మినిస్ట్రీ ఆఫ్‌‌‌‌ సివిల్‌‌‌‌ ఏవియేషన్‌‌‌‌(ఎంసీఏ) లు ఇన్‌‌‌‌ల్యాండ్‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌ అథారిటీ(ఐడబ్ల్యూఏఐ)ని కోరాయి. దీంతో పాటు ప్యాసెంజర్లు సీప్లేన్లలో ఎక్కేందుకు వీలుగా జెట్టీస్‌‌‌‌(ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ వంటివి)ను ఏర్పాటు చేయాలని కోరాయి. కాగా, నదులు, సముద్రాలు వంటి వాటిని స్డడీ చేయడాన్ని హైడ్రోగ్రాఫిక్‌‌‌‌ సర్వే అంటారు. గుజరాత్‌‌‌‌లో సీప్లేన్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లను లాంచ్‌‌‌‌ చేశాక, గౌహతి, అండమాన్‌‌‌‌ అండ్ నికోబార్‌‌‌‌‌‌‌‌, ఉత్తరాఖాండ్‌‌‌‌ వంటి రూట్లలో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌లను ప్రారంభిస్తామని గత వారం షిప్పింగ్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ మన్సుఖ్‌‌‌‌ మాండవీయ చెప్పిన విషయం తెలిసిందే.

* దసరా నవరాత్రుల సీజన్‌‌లో ఆటో అమ్మకాలు అదరగొట్టాయి. లీడింగ్ కారు కంపెనీలు మారుతీ సుజుకి ఇండియా, హ్యుండాయ్, టాటా మోటార్స్ వంటి కంపెనీలన్ని గతేడాది నవరాత్రితో పోలిస్తే ఈ ఏడాది నవరాత్రికి మెరుగైన రిటైల్ సేల్స్‌‌ను నమోదు చేసినట్టు వెల్లడించాయి. కియా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా కంపెనీలు కూడా ఈ పది రోజుల కాలంలో(దసరాతో కలిపి) గణనీయమైన సేల్స్ నమోదు చేసినట్టు పేర్కొన్నాయి.

* రీజినల్‌‌‌‌ రూరల్‌‌‌‌ బ్యాంకు(ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌బీ)లకు క్యాపిటల్‌‌‌‌ సపోర్ట్‌‌‌‌ను అందించేందుకు ప్రభుత్వం రూ. 670 కోట్లను కేటాయించింది. నార్త్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌, ఈస్ట్రన్‌‌‌‌ రీజియన్‌‌‌‌లలో ఉన్న బ్యాంకులకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం 43 రూరల్‌‌‌‌ బ్యాంకుల్లో 14 పైగా బ్యాంకులు నార్త్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌, ఈస్ట్రన్‌‌‌‌ రీజియన్‌‌‌‌ల నుంచే ఉన్నాయి. ఈ బ్యాంకుల క్యాపిటల్‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రూల్స్‌‌‌‌ ప్రకారం ఉండాల్సిన 9 శాతం కంటే తక్కువ ఉందని ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఈ రీక్యాపిటలైజేషన్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ కింద కేంద్రం, సంబంధిత రాష్ట్రం, సంబంధిత బ్యాంకు కలిసి 50:15:35 రేషియోలో క్యాపిటల్‌‌‌‌ను అందిస్తాయి. వచ్చే ఏడాది మార్చి 31 వరకు బ్యాంకుల క్యాపిటల్‌‌‌‌ అవసరాలను తీర్చేందుకు ఈ డబ్బులు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.