Movies

మాకు స్వేచ్ఛ కలుగుతుంది

మాకు స్వేచ్ఛ కలుగుతుంది

ఓటీటీ వేదికల వల్ల సృజనాత్మక స్వేచ్ఛ లభించిందని, దర్శకనిర్మాతలు తాము అనుకున్న రీతిలో కథాంశాల్ని రూపొందిస్తున్నారని చెప్పింది అగ్ర కథానాయిక కియారా అద్వాణీ. అక్షయ్‌కుమార్‌ సరసన ఆమె కథానాయికగా నటించిన ‘లక్ష్మీ’ (‘కాంచన’రీమేక్‌) చిత్రం త్వరలో ఓటీటీలో విడుదలకానుంది. రాఘవలారెన్స్‌ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా కియారా అద్వాణీ మాట్లాడుతూ “లస్ట్‌స్టోరీస్‌’ వెబ్‌సిరీస్‌ నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాతే భారీ సినిమా అవకాశాలొచ్చాయి. కాబట్టి ఓటీటీ వేదికలంటే నాకు చిన్నచూపులేదు. లాక్‌డౌన్‌ సమయంలో ఓటీటీల ద్వారా మనం ప్రపంచ సినిమాల్ని చూశాం. దీనివల్ల కొత్త కథల్ని సులభంగా తెలుసుకునే అవకాశం దక్కుతుంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా తీరుతెన్నులు ఎలా ఉన్నాయో అవగాహన కలుగుతుంది. థియేటర్‌ , ఓటీటీ ప్లాట్‌ఫామ్‌..ఏ వేదిక అయినా ఎక్కువ మందికి చేరువకావాలని నేను కోరుకుంటాను. భవిష్యత్తులో వెబ్‌సిరీస్‌లతో పాటు సినిమాలకు కూడా సమప్రాధాన్యతనిస్తా’ అని పేర్కొంది. తెలుగులో కియారా అద్వాణీ ‘భరత్‌ అనే నేను’ ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.