సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువ అయిపోతున్నాయి. వీటన్నింటి గురించి ప్రస్తావించాలనుకున్నారు గాయని నేహా బాసిన్. ఓ పాట ద్వారా ఈ విషయాలను ప్రస్తావించారు. ‘జనతా గ్యారేజ్’లో ‘యాపిల్ బ్యూటీ…’, ‘జై లవకుశ’ లో ‘స్వింగ్ జరా స్వింగ్ జరా..’ పాటలతో తెలుగులోనూ పాపులర్ అయ్యారు నేహా. తాజాగా ‘కేందే రేందే’ అంటూ సాగే ఓ ప్రైవేట్ సాంగ్‌ను రికార్డ్ చేశారామె. ఆన్‌లైన్ ట్రోల్స్, లింగ వివక్ష, బంధుప్రీతి, శరీరాకృతిని విమర్శించడం వంటి అంశాలతో ఈ పాట ఉంటుంది. ‘‘ప్రస్తుతం సమాజంలో ఎక్కడ చూసినా ఈ అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్ అయినా ఆఫ్‌లైన్ అయినా సరే… మగవాళ్లు ఇలా ఉండొచ్చు, ఆడవాళ్లు ఇలానే ఉండాలి అనే మనస్తత్వం మారాలి. ఆ మార్పు కోసం నా పాట ఉపయోగపడాలనుకున్నాను. అందుకే ఈ పాట చేశాను’’ అన్నారు నేహా బాసిన్.
మగాళ్లలో మార్పు కోసం పాట
Related tags :