WorldWonders

ఈ ఇల్లు ₹87!

ఈ ఇల్లు ₹87లే!

ఎనభై ఏడు రూపాయలు పెడితే మీరో ఇంటి వారు కావచ్చు. అదేంటి? మరీ 87 రూపాయలకు ఇల్లు ఎవరు అమ్ముతారని అంటారా? అమ్ముతున్నారు. అయితే ఇక్కడ కాదు. ఇటలీలోని సిసిలీ అనే ఊరిలో!
ఈ ఊరు ఒకప్పుడు ప్రజలతో కళకళలాడుతూ ఉండేది. 1968లో వచ్చిన భూకంపం ప్రభావం ఈ ఊరిపై చాలా పడింది. ఆ తరువాత చాలా మంది ఇతర పట్టణాలకు తరలి వెళ్లారు. దాంతో ఊరంతా ఖాళీ అయింది.
ప్రస్తుతం ఆ ఊళ్లో అన్నీ ఖాళీ ఇల్లే దర్శనమిస్తాయి. మళ్లీ ఎలాగైనా ఊరు జనంతో నిండిపోయేలా చేయాలని ప్రభుత్వం అక్కడి ఇళ్లను అతి తక్కువ ధరకు వేలంలో విక్రయిస్తోంది.కనిష్ఠ ధర ఒక యూరోగా నిర్ణయించింది. ఒక యూరో అంటే ఇండియన్‌ కరెన్సీలో 87 రూపాయలు. ఈ ధర చెల్లించి ఇల్లు కొనుక్కోవచ్చు. ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ వేలం పాటలోనూ పాల్గొనవచ్చు.వేలం పాటలో ఇల్లు సొంతం చేసుకున్న వారు ఒక షరతును అంగీకరించాల్సి ఉంటుంది. 2,61,304 రూపాయలను డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. మూడేళ్లలో ఇంటిని మరమ్మతు చేయించు కుంటే ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తారు.