మరికొద్ది గంటల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ మరోసారి డ్రాగన్ దేశంపై నిప్పులు చెరిగారు.
‘చైనా చేసిన పనిని అమెరికా గుర్తపెట్టుకుంటుంది’ అంటూ వ్యాఖ్యానించారు.
వివరాల్లోకి వెళితే నవంబర్ 3న అత్యంత శక్తివంతమైన పదవికి ఎన్నికలు జరగనున్నాయి.
మరో నాలుగేళ్లపాలు అమెరికా అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ క్రమంలో ఆదివారం రోజు ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆయన కరోనా వైరస్ విషయంలో చైనాపై మరోసారి విరుచుకుపడ్డారు.
వైరస్ వ్యాప్తి చెందకుండా చైనా కట్టడి చేయలేకపోయిందని ట్రంప్ ఆరోపించారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడానికి చైనానే కారణమని విమర్శించారు. చైనా చేసిన పనిని అమెరికా ఎప్పటికీ మరిచిపోదన్నారు.
అయితే ఇప్పుడు ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికా క్రమంగా కోలుకుంటోందని ట్రంప్ పేర్కొన్నారు.