* ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌పై సెలబ్రిటీలకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్యాంబ్లింగ్‌కు అనుకూల ప్రకటనల్లో నటించిన క్రికెటర్లు విరాట్ కొహ్లి, సౌరవ్ గంగూలీ, సినీ నటులు దగ్గుపాటి రానా, సుదీప్, ప్రకాశ్ రాజ్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌లో వందలాది మంది డబ్బులు పొగొట్టుకున్నారని పిటిషినర్ తెలిపాడు. విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌కు మద్దతుగా ప్రకటనల్లో నటించిన సెలబ్రిటీలకు నోటీసులు అందించింది. ఈ ప్రకటనల్లో ఎందుకు నటించాల్సి వచ్చిందో ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
* మేడ్చల్ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం.రైల్లో నుండి పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు.అగ్నిప్రమాదానికి కల కారణాలు తెలియాల్సి ఉంది.
* నగరంలోని బార్బీక్యూ నేషన్ రెస్టారెంట్లో పుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లో పలు నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. కనీసం కోవిడ్ నిబంధనలు పాటించకుండానే రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. దీనిపై విజిలెన్స్ ఎస్పీ కనకరాజు, పుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. ‘నిల్వ ఉన్న 1500 కిలోల మటన్‌ను గుర్తించాం. ఆహారంలో నిషిద్ధ రంగులు వాడుతున్నారు. ఎంతోకాలంగా నిల్వ ఉంచిన హల్వాను వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. హోటల్ లో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. దీనిపై జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. రెస్టారెంట్‌లోకొన్ని సాంపిల్స్ సేకరించాం. పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపి రిపోర్టుల ఆధారంగా రెస్టారెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
* నందిగామ మండలం దాములూరు గ్రామంలో విషాదం.కూడలి కట్టలేరు వాగు లో సరదాగా ఈత కి దిగిన ముగ్గురు బాలికలు.శేషం లావణ్య అనే ఇంటర్ చదివే విద్యార్థిని నీటిలో మునిగి ఊపిరాడక మృతి.మిగిలిన ఇద్దరు బాలికలు క్షేమంగా బయటపడ్డారు.
* కర్నూలు జిల్లా పాణ్యం మండలం కౌలూరులో విషాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలు కిందపడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లలతో పాటు దంపతులు మరణించారు.
* యువతి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.ఆ యువతికి పరిచయస్తుడైన రామ్‌ను కొట్టించడానికి ఇద్దరు వ్యక్తులు ఓ రౌడీషీటర్ కుమారుడిని ఆశ్రయించినట్లు గుర్తించారు పోలీసులు.రౌడీషీటర్ కుమారుడు డబ్బులు తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలింది.కానీ ఆ రౌడీషీటర్ కుమారుడు రామ్‌పై దాడి చేసిన దాఖలాలు లేవు.డబ్బు తీసుకుని మోసం చేశాడా? లేదంటే డబ్బులు తీసుకున్న వ్యక్తి ఏమైనా ప్రణాళికలు రచించి అమలు చేశాడా? అన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.పోలీసులు మరో కేసు నమోదు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.అఖిల్‌కు సాయం చేసిన వారెవరన్న కోణంలో పోలీసులు అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నారు.పోలీసులు మరికొందరి పాత్రపై కూడా విచారణ జరుపుతున్నారు. అఖిల్ తండ్రిపై గతంలో రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.దీంతో ఆయనపై నమోదైన కేసులను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.ఆయన సత్ప్రవర్తనతో ఉన్నందున రౌడీషీట్ తొలగించినట్లు గుర్తించారు. అఖిల్ ఉదంతంలో తండ్రి పోలీసులకు పూర్తిగా సహకరించారు.
* మాజీ మంత్రి దేవినేని ఉమా కు షాక్ ఇచ్చిన జక్కంపూడి- షాబాద్ గ్రామస్దులు.గ్రామస్తుల ఎదురుతిరిగి ప్రశ్నించడంతో అక్కడ నుండి మెల్లిగా జారుకున్న దేవినేని ఉమ అతని అనుచరులు.ఎప్పటిలాగానే తనదైన శైలిలో నలుగురిని వెంటేసుకుని జక్కంపూడి – షాబాద్ లో గత ప్రభుత్వం హయాంలో నిర్మాణం చేపట్టి అసంపూర్తి గా ఉన్న ఇళ్ల వద్ద ఆందోళనకు సిద్దం కాగా గ్రామస్తుల అక్కడకు చేరుకుని మాజీ మంత్రి పై అగ్రహం వ్యక్తం చేశారు.మా పేదల దగ్గర నుండి భూములు తీసుకున్న మీరు మాకూ ఇళ్లు ఇవ్వకుండా ఎక్కడో విజయవాడ లో ఉండే వాళ్ళకు ఎందుకు ఇచ్చారు. మాకు న్యాయం చేస్తామని చెప్పి మాట భూములు తీసుకుని మమ్మల్ని మోసం చేశారంటూ స్థానికులు ఎదురుతిరగి ప్రశ్నించిడంతో అక్కడ నుండి వెళ్లిపోయిన మాజీ మంత్రి దేవినేని ఉమా.దేవినేని ఉమా చేసిన తప్పుడు పనులను ప్రశ్నిస్తున్న జక్కంపూడి- షాబాద్ గ్రామస్తులు.
* కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం కోడూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రం ద్యారా కొనుగోలు చేసిన బిపిటి 5204 వరి విత్తనాలు సాగు చేసి రైతులు నిండా మునిగారు.
* సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది.జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడుల చార్జ్ షీట్ నుంచి తనను తొలగించాలన్న జగన్ డిశ్చార్జి పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి.ఓఎంసీ అక్రమాల కేసు విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.ఓబుళాపురం గనుల అక్రమాల కేసులో గాలి జనార్దన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.ఓఎంసీ అక్రమాల కేసు నుంచి తనను తొలగించాలని గాలి జనార్దన్ రెడ్డి కోరారు.గాలి జనార్దన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్లో కౌంటరు దాఖలుకు సీబీఐ సమయం కోరింది.ఓఎంసీ కేసులో అభియోగాల నమోదు ప్రక్రియ వాయిదా వేయాలని వీడీ రాజగోపాల్ పిటిషన్ వేశారు.సరిహద్దు వివాదంపై సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని రాజగోపాల్ కోరారు.గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణంలో ఏసీబీ కోర్టులో సాక్షుల విచారణ కొనసాగింది.గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసు విచారణ రేపటికి వాయిదా పడింది.