ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ మధ్య పోటీ నువ్వా.. నేనా.. అన్న రీతిలో సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరికీ 269 చొప్పున ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు వచ్చి.. ఎన్నికలు టై అయితే పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టై పరిస్థితిని ఊహించిన అమెరికన్ రాజ్యాంగం.. దాన్ని అధిగమించడానికి కొన్ని మార్గదర్శకాలను ఇచ్చింది. ఎలక్టోరల్ కాలేజీ ద్వారా విజేతను ఎంపిక చేయడం కుదరకపోతే 2వ అధికరణంలోని సెక్షన్ 1లో మూడో క్లాజు ప్రకారం.. అధ్యక్షుడిని కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ ఎన్నుకోవాలి. ఉపాధ్యక్షుడిని సెనేట్ ఎన్నుకుంటుంది. అయితే సెనేట్‌లో ఉపాధ్యక్ష ఎన్నిక కోసం ఒక్కో సెనేటర్‌కు ఒక ఓటు దక్కుతుంది. అధ్యక్ష ఎన్నిక కోసం ప్రతినిధుల సభలో రాష్ట్రానికి ఒకటి చొప్పున మాత్రమే ఓటు ఉంటుంది. ఆ రాష్ట్ర పరిమాణంతో దీనికి సంబంధం లేదు. ఈ లెక్కన అధ్యక్షుడు గెలవడానికి 26 రాష్ట్రాల మద్దతు అవసరం. ప్రస్తుత సభలో అలాంటి బలం రిపబ్లికన్లకు ఉంది. డెమొక్రాట్లకు 23 రాష్ట్రాల్లో ఆధిపత్యం ఉంది. కానీ ఇది ట్రంప్‌కు ఉపయోగపడదు. ఎందుకంటే ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలతోపాటు కాంగ్రెస్‌కు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల ఫలితం ప్రకటించేలోగా కొత్త కాంగ్రెస్ ఫలితాలు కూడా తెలుస్తాయి. అందులో ఎవరికి మెజారిటీ వస్తుందో చెప్పలేం. అందుకే అధ్యక్ష ఎన్నిక సమం అయినట్లయితే కాంగ్రెస్‌కు జరుగుతున్న ఎన్నికలు కూడా కీలకమే.
ఫలితం ఎటూ తేలకపోతే…?
Related tags :