సీనియర్ కథానాయిక అమలాపాల్ తన మాజీప్రియుడు భవీందర్‌సింగ్‌పై మద్రాస్ హైకోర్టులో పరువునష్టం దావా వేయడానికి సిద్ధమవుతోంది. తన అనుమతిలేకుండా వ్యక్తిగత ఫొటోలను సోషల్‌మీడియాలో పెట్టడంతో పాటు తామిద్దరం పెళ్లిచేసుకున్నామని భవీందర్‌సింగ్ తప్పుడు ప్రచారం చేశాడని అమలాపాల్ ఆరోపించింది. వివరాల్లోకి వెళితే…గాయకుడు భవీందర్‌సింగ్‌తో గత కొన్నేళ్లుగా అమలాపాల్ ప్రేమాయణం నడుపుతోందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని మాసాల క్రితం అమలాపాల్‌తో కలిసి సంప్రదాయ పెళ్లిదుస్తుల్లో తీయించుకున్న ఫొటోల్ని భవీందర్‌సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోల్ని చూసిన నెటిజన్లు..అమలాపాల్ రహస్య వివాహం చేసుకుందంటూ కామెంట్స్ చేశారు. సోషల్‌మీడియాలో ప్రశ్నలపరంపరతో ఖంగుతిన్న భవీందర్‌సింగ్ వెంటనే ఆ పోస్ట్‌ను తొలిగించాడు. అయితే ఈ ఫొటోల వ్యవహారంపై అప్పుడు ఏమాత్రం స్పందించని అమలాపాల్ తాజాగా భవీందర్‌సింగ్‌పై కోర్టులో పరువునష్టం దావా వేయడానికి సిద్ధమవడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి మధ్య లవ్‌ఎఫైర్ బెడిసికొట్టడంతో అమలాపాల్ మాజీప్రియుడిపై కోర్టుకెక్కడానికి సిద్ధమైందని చెన్నై సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
అమలాపాల్ పెళ్లిపై తప్పుడు ప్రచారం
Related tags :