పోస్టల్ బ్యాలెట్లను అనుమతించడాన్ని ఆపివేయాలని, దానిపై సుప్రీం కోర్టుకు వెళ్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై అధ్యక్ష అభ్యర్థి జోబైడెన్ శిబిరం నుంచి గట్టి సమాధానం వచ్చింది. ‘ఓట్ల లెక్కింపును నిలిపివేయించేందుకు ట్రంప్ సుప్రీంకోర్టుకు వెళ్తే..ఆ ప్రయత్నాన్ని ప్రతిఘటించడానికి తమ వద్ద చట్టపరమైన బృందాలు సిద్ధంగా ఉన్నాయి’ అని బైడెన్ ప్రచార నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, ట్రంప్ ముందస్తుగానే ఎన్నికల విజయంపై ప్రకటన చేయడాన్ని జర్మనీ రక్షణ శాఖ మంత్రి అన్నెగ్రెట్ క్రాంప్ తప్పుపట్టారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ..‘ఇంకా ఎన్నికల కౌంటింగ్ జరుగుతూనే ఉంది. ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడికాలేదు. ట్రంప్ యూఎస్‌లో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించే అవకాశం ఉంది’ అని హెచ్చరించారు.
ట్రంపే కాదు మేము కూడా సుప్రీంకు వెళ్తాం
Related tags :