సాధారణంగా జున్ను అనగానే నోరూరించే పదార్థం. ఇది నోటికి రుచి అందించడమే కాదు. శరీరానికి ఆరోగ్యాన్ని, మొహానికి అందాన్నీ ఇస్తుంది. అటువంటి జున్నులో విటమిన్లు పుష్కలంగా దొరుకుతాయి.జున్నులో విటమిన్-డి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో డి-విటమిన్ లోపంతో కలిగే ఆస్టియోపోరోసిస్ లోపాలను అధిగమించడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు పుష్టిగా ఉంటారు.విరేచనాలు, మలబద్ధకానికి జున్ను విరుగుడులా పని చేస్తుంది. జున్నుతో శరీరంలో రోగనిరోధక శక్తికూడా పెరుగుతుంది.సన్నగా ఉన్న వారు క్రమం తప్పకుండా జున్ను తీసుకుంటే శరీరాకృతిలో మార్పులు గమనించవచ్చు. జున్నులోని ప్రోటీన్లు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. దీంతోపాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.అందమైన ముఖంకోసం జున్నును ఉపయోగించవచ్చు. ఒక స్పూన్ ఓట్స్‌లో, రెండు స్పూన్ల జున్ను వేసి పేస్ట్ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు మందంగా పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.వాతావరణ కాలుష్యం వల్ల ముఖం అలసిపోయి, నిర్జీవంగా మారుతుంది. అలాంటపుడు జున్నుతో మర్దన చేయాలి. యాంటీఏంజిల్ గుణాలు కలిగిన జున్ను ఈ సమస్యను పరిష్కరిస్తుంది.
జున్ను నిండా పోషకాలే!
Related tags :