Fashion

కుటుంబాన్ని పోషించేందుకు అప్పులు చేస్తున్న భారతీయులు

Lifetyle News - Indians Falling Into Debt To Feed Family

ప్రస్తుత కరోనా కష్టకాలంలో దాదాపు సగం (46 శాతం) మంది భారతీయులు తమ కుటుంబ పోషణ కోసం అప్పు చేశారని హోమ్‌ క్రెడిట్‌ ఇండి యా నివేదిక వెల్లడించింది. తిరిగి చెల్లింపుల్లో వెసులుబాటు కోసం చాలా మంది తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి అప్పు తీసుకున్నారని తెలిపింది. వైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా వ్యాపారాలు స్తంభించిపోయాయి. దాంతో అన్ని రంగాల్లోనూ కంపెనీల యాజమాన్యాలు ఉద్యోగులను తొలగించడం లేదా వేతనాల్లో కోతలు విధించాయి. తత్ఫలితంగా దిగువ మధ్య తరగతి వర్గంపై తీవ్రంగా ప్రభావం పడిందని రిపోర్టు పేర్కొంది. దాంతో రుణ ప్రాధాన్యతల్లో మార్పులొచ్చాయని హోమ్‌ క్రెడిట్‌ తెలిపింది. లాక్‌డౌన్‌ కాలంలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఏయే అవసరాల కోసం రుణాలు తీసుకున్నారన్న విషయంపై హోమ్‌ క్రెడిట్‌ అధ్యయనం చేసింది. ఇందుకోసం 1,000 మందిని సర్వే చేసినట్లు సంస్థ తెలిపింది. 27% – వేతనాల కోత లేదా జాప్యం కారణంగా ఈఎంఐలు చెల్లించేందుకు అప్పు చేసినవారు.. 14%- ఉద్యోగం కోల్పోయిన కారణంగా అత్యవసరాల కోసం రుణం తీసుకున్నవారు.