NRI-NRT

ఫలితాలు తేలని రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠత

ఫలితాలు తేలని రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠత

ప్రతి రాష్ట్రానికి కొన్ని ఎలక్టోరల్ వోట్లు ఉంటై. ఆయా రాష్టాల్లో ఎవరికి ఎక్కువ వోట్లు వస్తే ఆ రాష్ట్రానికి కేటాయించిన ఎలక్టోరల్ వోట్లు వారికి వస్తాయి.

50 రాష్ట్రాల్లో మొత్తం ఉన్న 538లో అధ్యక్షుడుగా గెలవాలంటే 270 ఎలక్టోరల్ వోట్లు రావాలి. ప్రస్తుత లెక్కింపు ప్రకారం వచ్చిన ఎలక్టోరల్ వోట్లు.

జో బైడెన్ = 238
డోనాల్డ్ ట్రంప్ = 213

పెండింగ్ రాష్ట్రాలు: ఇంకా ఫలితాలు తేలని రాష్ట్రాలు
1. జార్జియా (16 ఎలక్టోరల్ వోట్లు) : 94 % లెక్కింపు పూర్తి అయ్యేసరికి డోనాల్డ్ ట్రంప్ లక్ష వోట్ల మెజార్టీ తో ఉన్నాడు. గమనించాల్సిన విషయం, మిగిలిన 6% లెక్కింపు ప్రదేశాల్లో అట్లాంటా సిటీ ఉంది, అక్కడ జో బైడెన్ కే ఎక్కువ పడ్తాయి. కానీ ఓవర్ అల్ గా జార్జియా 16 ఎలక్టోరల్ వోట్లు ట్రంప్ కే వచ్చే అవకాశం ఉంది.
2. నార్త్ కరోలినా (15 ఎలక్టోరల్ వోట్లు) : 94% లెక్కింపు అయ్యేసరికి ట్రంప్ 79 వేల మెజార్టీ తో ఉన్నాడు కానీ లెక్కింపు పూర్తి కాని చార్లెట్ , ర్యాలీ, గ్రీన్స్ బారో, ఫయట్ వెల్లీ లో జో బైడెన్ కే ఎక్కువ వోట్లు వస్తాయి. ఒవర్ ఆల్ గా ఇక్కడ కొంచెం మెజార్టీ తో ట్రంప్ గెలిచే అవకాశం ఉంది.
3. విస్కాన్సిన్ ( 10 ఎలక్టోరల్ వోట్లు) : 94% లెక్కింపు పూర్తి అయ్యేసరికి ట్రంప్ లక్షా 20 వేల మెజార్టీ తో ఉన్నాడు. కానీ లెక్కించాల్సి ఉన్న మిగతా 6% లో మాడిసన్, కెనోషా, గ్రీన్ బే, మిల్ వాకీ లో జో బైడెన్ కే ఎక్కువ వస్తాయి. ఓవర్ అల్ గా ట్రంప్ కే ఉండొచ్చు.
4. మిచిగన్ (16 ఎలక్టోరల్ వోట్లు) : 80% మాత్రమే లెక్కిపు పూర్తి అయ్యింది. ప్రస్తుతం ట్రంప్ 2.2 లక్షల మెజార్టీ తో ఉన్నాడు కానీ డెట్రాయిట్, లాన్సింగ్ లాంటి ప్లేస్ లల్లో ఓట్ల లెక్కింపు మొదలు కాలేదు. అక్కడ సాలిడ్ గా జో బైడెన్ కే పడతాయి. ఇక్కడ మాత్రం ట్రంప్ ఆధిక్యం లో ఉన్నా గెలుస్తాడు అని చెప్పలేం.
5. నెవేడా ( 6 ఎలక్టోరల్ వోట్లు): 67% వోట్ల లెక్కింపు అయ్యేసరికి 23 వేల మెజార్తీ తో జో బైడెన్ ఉన్నాడు. లాస్ వేగస్, రెనో లాంటి చోట ఇంకా వోట్ల లెక్కింపు మొదలు కాలేదు. ఎక్కువ శాతం జో బైడెన్, కానీ ట్రంప్ కి కూడా ఛాన్స్ ఉంది.
6. పెన్సిల్ వేనియా (20 ఎలక్టోరల్ వోట్లు): 64% లెక్కింపు పూర్తి అయ్యేసరికి డోనాల్డ్ ట్రంప్ 7 లక్షల మెజార్టీ తో ఉన్నాడు. కానీ పిట్స్ బర్గ్, ఫిలడెల్ఫియా లాంటి చోట లెక్కింపు మొదలు కాలేదు. అక్కడ జో బైడెన్ కే ఎక్కువ పడే అవకాశం ఎక్కువ.
7. అలస్కా (3 ఏక్టోరల్ వోట్లు): పూర్తి ఫలితాలు రాలేదు కాని ట్రంప్ గెలిసే అవకాశం ఉంది.

*** ఫైనల్ ఫలితం:
జార్జియా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ ట్రంప్ ఖాతాలో వేస్తే 213+ 16 + 15 + 10 + 3 = 257
మిచిగన్, నెవేడా జో బైడెన్ ఖాతా లో వేస్తే 238+ 16 + 6 = 260
సో, పెన్సిల్ వేనియా (20 ఎలక్టోరల్ వోట్లు) లో ఎవరు గెలిస్తే వాళ్ళే ప్రెసిడెంట్. ట్రంప్ మిగతావి అనుకున్నట్లు గెలిసి ఇక్కడ కూడా గెలిస్తే 257+ 20= 277. ఒకవేళ బైడెన్ మిగతావాటిల్లో అనుకున్నట్లు గెలిసి ఇక్కడ కూడా గెలిస్తే 260+20= 280
గెలవటానికి 270 కావాలి.