చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కవచ్చో తెలుసుకోవాలంటే నిపుణుల సూచనలు పాటించాల్సిందే.శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వకూడదు అంటే.. వ్యాధినిరోధక శక్తి కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. హాయిగా నిద్రపోవాలి. వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. అల్పాహారంలో ఓట్స్ ఉండేలా చూసుకోవాలి. నట్స్, యాపిల్స్, పియర్స్, క్రాన్‌బెర్రీస్ వంటివి తీసుకోవాలి. పాలకూర, ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలి. మాంసాహారంలో చేపలు, కోడిగుడ్లు వంటివి చేర్చడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అల్లం, వెల్లుల్లిని డైట్‌లో చేర్చుకుంటే జలుబు, దగ్గు వంటి రుగ్మతలను దూరం చేసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
చలికాలం క్రాన్‌బెర్రీస్ తినాలి
Related tags :