‘పనిచేస్తుండటమే అన్నింటికన్నా ఆనందం కలిగించే విషయం’ అంటోంది బాలీవుడ్ అందాల రాశి కత్రినాకైఫ్. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్… ఇలా అన్ని సినీ పరిశ్రమల్లోని తారలు చాలాకాలం తర్వాత మళ్లీ షూటింగ్ పనుల్లోకి అడుగుపెడుతున్నారు. ఇటీవలే కత్రినా కూడా చిత్రీకరణలో పాల్గొనడానికి బయలుదేరారు. ఈ సందర్భంగా పీపీఈ కిట్ ధరించి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన చిత్రాన్ని ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ‘ఎనిమిదినెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ చిత్రీకరణ పనుల్లోకి వచ్చాను. ఇంతకంటే సంతోషం కలిగించే విషయం ఏముంటుంది?’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది కత్రినా. దీనికి తన అందమైన ఫొటోను ఒకటి జతచేసి అభిమానులను అలరించింది. ఇప్పటికే అక్షయ్‌కుమార్‌తో ‘సూర్యవంశీ’ పూర్తిచేసిన ఈ కథానాయికి.. సిద్ధాంత్ చతుర్వేది తెరకెక్కిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘ఫోన్ బూత్’లోనూ నటిస్తోంది.
పనిలోనే పరమానందం
Related tags :