DailyDose

జగన్ అక్రమాస్తుల కేసు 9వ తేదీకి వాయిదా-నేరవార్తలు

జగన్ అక్రమాస్తుల కేసు 9వ తేదీకి వాయిదా-నేరవార్తలు

* ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై నేడు సీబీఐ కోర్టు విచారణ నిర్వహించిందిజగన్ కేసులో ఈడీ, సీబీఐ కేసులు వేర్వేరుగా విచారించాలన్న అంశంపై విచారణ నిర్వహించింది.జగతి పబ్లికేషన్స్ చార్జిషీట్‌లో డిశ్చార్జ్ పిటిషన్‌పై జగన్ తరఫున వాదనలు కొనసాగాయి.సీబీఐ చార్జిషీట్లపై ఈనెల 9న విచారణ చేస్తామని న్యాయస్థానం వెల్లడించింది. 

* కర్ణాటక నుండీ అక్రమమద్యాన్ని రెండుకార్లలో తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసునమోదు చేసిన సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది.

* మంత్రి కొప్పుల ఈశ్వర్‌ లిఫ్టులో ఇరుక్కుపోయారు. సిబ్బంది తీవ్రంగా శ్రమించిన అనంతరం 30 నిమిషాల తర్వాత సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు.. శుక్రవారం సైఫాబాద్‌లోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి కొప్పుల ఈశ్వర్. కార్యక్రమం ముగించుకుని తిరిగివస్తూ అక్కడి లిఫ్ట్‌లోకి ఎక్కారు. అయితే ఆ లిఫ్ట్‌ మధ్యలోనే ఆగిపోయింది. అందులోనుంచి మంత్రిని బయటకు తీసుకువచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. దాదాపు 30 నిమిషాలు కష్టం అనంతరం లిఫ్ట్‌ లాక్‌ ఓపెన్‌ అయింది. దీంతో మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. 

* దీపావళి టపాకాయల విషయంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవుడి లేదా దేవతల బొమ్మలు ఉండే టపాకాయలు అమ్మినా, ఉపయోగించినా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు. అలాంటి బొమ్మలతో కూడిన టపాకాయలు ఉపయోగించి ప్రజల మత విశ్వాసాలను దెబ్బతీయొద్దని ప్రజలకు ఆయన సూచించారు. ఈ మేరకు చౌహాన్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

* విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం సబ్ రిజిస్టార్ రోహన్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది.పాలవలసలో 5.4 ఎకరాల, మాజీ సైనికుల కోటాలో అక్రమంగా తెచ్చుకున్న భూమిని రిజిస్ట్రేషన్ చేసినందుకు రోహన్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.ఓ వైసీపీ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతో  రిజిస్టార్ భూమిని రిజిస్ట్రేషన్ చేశారు.విషయాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు రోహన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.అలాగే  ఇది ప్రభుత్వ భూమని అప్పీల్ చేయాలని ఎమ్మార్వోకు జిల్లా ఉన్నతాధికారులు సూచించారు.ఈ భూమి వ్యవహారాన్ని గతంలోనే వెలుగులోకి తీసుకువచ్చింది.

* నూజివీడులో క్రికెట్ బుకీ పాల్పడుతున్న పట్టణానికి చెందిన ఒక వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన నలుగురు నీ అరెస్ట్ చేసిన పోలీసులు

* జల్సాల కు అలవాటు పడి దొంగగా మారిన హోంగార్డు పై సైబరాబాద్ కమీషనర్ ఆదేశాల మేరకు పిడియాక్టు నమోదు చేసి జైలుకు తరలించిన శంషాబాద్ రూరల్ పొలీసులు.

* రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఆఫీసర్స్ కాలనీ లో న్యాయవాది మహేష్ చంద్ర ఇంట్లో రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు తాళం వేసి సొంత గ్రామానికి వెళ్లిన మహేష్ చంద్ర ఇంట్లోకి దొంగలు తాళం విరగొటీ ఇంట్లోని బీరువా తెరచి అందులో దాదాపు యాబై ఐదు వేల నగదుతో పాటుగా వెండి వస్తువులు అపహరించారు