వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు కోరుతున్నట్టు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుపుతున్న రజనీకాంత్‌తో రాజకీయాలపై చర్చిస్తున్నట్టు కమల్ పేర్కొన్నారు. రజనీకాంత్ తన రాజకీయ వైఖరిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అంతకంటే ముందు ఆయన ఆరోగ్యం చాలా ముఖ్యమన్నారు. తమ ఎంఎన్ఎం పార్టీ నిందారోపణలతో కూడిన ప్రతీకార రాజకీయాలు చేయబోదని, మార్గదర్శక రాజకీయాలకు కట్టుబడుతుందని తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
నేను రజనీ మద్దతు తప్పకుండా కోరతాను
Related tags :