Kids

నమ్మకమే నారాయణుడు!

నమ్మకమే నారాయణుడు!

చాలాకాలం క్రితం ఒక పల్లెటూరు. ఆ ఊర్లో పాలు పెరుగు అమ్ముకునే పొట్టపోసుకునే ఇద్దరు యాదవమహిళలు ఉన్నారు. వారిదగ్గర ఉన్న చెరి రెండు ఆవుల పాలు,పెరుగు అమ్మేందుకు నగరానికి వెళ్లవలసి వచ్చేది. నగరం చేరటానికి వారు ఓ నదిని దాటి వెళ్లేవారు అందుకు గాను ఆ పడవనడిపేవానికి కొంత పైకం ఇచ్చేవారు నగరంలో పాలు విక్రయించి తిరిగి ఇల్లు చేరేటప్పటికి సాయంత్రం అయ్యేది సొమ్ము చూస్తే వారు ఆరోజు తిన్న ఆహారానికి సరిపడగ మాత్రమే ఉండేది ఇదే వారి దినచర్య. ఆరకంగా ఆ గొల్లపడుచులు బాగా పేదరికంలో ఉండగా…ఒక రోజు ఆ ఊరికి ప్రవచనాలు చెప్పే ఓ స్వాములోరు వచ్చి గుడిలో ఏవో నాలుగు మంచిమాటలు చెపుతున్నారని తెలిసింది .వెళదామంటే పనిపాట్లతో కుదరక వెళ్ళలేకపోయారు .సరే మూడవరోజు ఎలా అయినా వెళ్లాలని గట్టిగా అనుకుని పెందలాడే పనులన్నీ ముగించుకుని సాయంత్రానికల్లా గుడి ఆవరణలోకి చేరుకున్నారు. అప్పుడు ఆసాములోరు ఏవో మాటలు చెప్తూన్నారు కానీ బొత్తిగా చదువుకోని కారణంగా వీల్లకు ఒక్కముక్క అర్ధమయినట్టే లేదు. ఆ రోజు ప్రవచనాలలో స్వాములోరు ఓంకారం యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను చెప్పారు ఇంతకు అందులో గొల్లపడుచులకు అర్థమయింది ఏమిటంటే ఓంకారం ఎంతో గొప్పది, శక్తివంతమైనదని.

మరుసటి రోజు యధావిధిగా నగరానికి పయనమైన గొల్లభామలు నదిని దాటేందుకు నిరీక్షిస్తున్న సమయంలో పడవవాడు లేకపోవటంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూండగా నిన్న గుడిలో విన్న ఓంకారం యొక్క గొప్పతనం గుర్తువచ్చింది. వెంటనే ఓంకారాన్ని జపిస్తూ నదిని దాటాలనుకున్నారు. ఓం…….ఓం….. అంటూ వడివడిగా అడుగులు వేస్తూ నదిని దాటి ఆవలివడ్డుకు చేరిపోయారు. ఈ విధంగా రోజు ఓంకార జపంతో నదిని దాటేయసాగారు. అందుకు గాను పడవవానికి ఇచ్చే పైసలు మిగలసాగాయి. దానితో వారు కాస్త సొమ్మును కొంచెం కొంచెం గా కూడబెట్టుకుని ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఒకనాడు ఈ గొల్లపడుచులకు ప్రవచనాలు చెప్పిన స్వామిజీ కనిపించారు. దానితో వీరు ఎంతో వినయంగా ఆ స్వామి వారికి నమస్కరించి మీ వలనే మేమీరోజు కాస్త డబ్బు కూడపెట్టుకుని ఆనందంగా ఉన్నామని విన్నవించారు,. మీరు చెప్పిన ఓంకారం మంత్రం వలనే మాకు నదినిదాటే పడవడబ్బులు మిగిలాయని చెప్పటంతో విస్తుపోయిన స్వామీజీ స్వయంగా వారు ఓం….. ఓం…. అనుకుంటూ నదిని దాటటం చూసి చాలా ఆశ్చర్యపోయాడు, తనుకూడా ఆవిధంగా చేయ ప్రయత్నించి నీల్లలో పడి మనిగిపోబోగా గొల్లపడుచులే రక్షించారు. అప్పుడు స్వామీజీ ఇలా ఆలోచించసాగాడు. నేను చెప్పిన మంత్రం నాకు పనిచేయలేదు కారణం దానిపై నాకున్న అపనమ్మకమే….., ఆ మంత్రం పట్ల పల్లె పడుచులకున్న దృఢ విశ్వాసమే వారిని నదిని దాటేలా చేసిందని అర్థమయింది.