Fashion

మేకప్ వలన ఇన్ఫెక్షన్లు వస్తాయి

మేకప్ వలన ఇన్ఫెక్షన్లు వస్తాయి

పౌడర్‌ అద్దుకునో లేదా ఫౌండేషన్‌ వేసుకున్న తరవాతో తుడవడానికి వాడే స్పాంజ్‌ను మళ్లీ అంతే జాగ్రత్తగా మేకప్‌ కిట్‌లో పెడుతుంటారు కొందరు. కానీ దీనివల్ల దానికి అతుక్కున్న బ్యాక్టీరియా మిగిలిన అన్ని వస్తువులకీ సోకి వాటిని కలుషితం చేస్తుంది. ఐషాడో, లిప్‌గ్లాసెస్‌, లిప్‌స్టిక్‌, కాజల్‌ కమ్‌ లైనర్‌ ఇలా వేటికి అతుక్కున్నా అవన్నీ ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. ఎందుకంటే ఈ-కోలి, స్టాఫైలోకోకై వంటి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తే రోగనిరోధక శక్తిమీద తీవ్రమైన ప్రభావాన్ని కనబరుస్తాయి. పైగా వీటిని ఓ పట్టాన నిరోధించలేం. కిట్‌లో ఉన్నవి ఎంత ఖరీదైన బ్రాండెడ్‌ వస్తువులయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దేనికైనా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది కాబట్టి స్పాంజి విషయంలో జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.