* అధ్యక్ష ఎన్నికల ఫలితాల విషయంలోనే కాకుండా..కరోనా వైరస్ విజృంభణలో కూడా అమెరికా ప్రపంచ దృష్టిని తనవైపునకు తిప్పుకుంటోంది. అగ్రదేశంలో రికార్డు స్థాయిలో వైరస్ కేసులు నమోదు కావడమే అందుకు కారణం. గడిచిన 24 గంటల్లో 1,27,000 పైచిలుకు కరోనా కేసుల నమోదయ్యాయని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. మరణాల సంఖ్య 1,149గా ఉందని తెలిపింది. అలాగే, కరోనా వైరస్ ప్రారంభ దశతో పోల్చుకుంటే మరణాల సంఖ్య ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నప్పటికీ, గత నాలుగు రోజులుగా ఆ సంఖ్య వెయ్యికి పైనే ఉంటోంది.
* రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో మొత్తంగా రూ.52,750 కోట్లు తగ్గుతుందని.. అందుకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని ఆర్థికశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా వేళ ఆర్థిక నష్టం నేపథ్యంలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ (2020-21)పై సీఎం కేసీఆర్ మధ్యంతర సమీక్ష నిర్వహించారు. భారీవర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం జరిగినా కేంద్రం ఒక్క రూపాయి సాయం చేయకపోవడం దారుణమని సీఎం కేసీఆర్ ఆక్షేపించారు.
* బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. మూడు దశల ఎన్నికలు నేటితో ముగిసిన నేపథ్యంలో ఆయా సంస్థలు తమ సర్వే వివరాలు వెల్లడించాయి. టైమ్స్‌నౌ- సీ ఓటర్ మహా కూటమికి ఆధిక్యం కట్టబెట్టింది. మహా కూటమికి 120, అధికార ఎన్డీయేకు 116 సీట్లు, ఎల్జేపీకి 1, ఇతరులకు 6 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇక పీపుల్స్ పల్స్ సైతం మహా కూటమివైపే ఓటర్లు మొగ్గినట్లు చూపించింది. ఆ కూటమికి 100-115 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.
కరోనా నేపథ్యంలో దేశీయ విమాన సర్వీసులతో పాటు అంతర్జాతీయ సర్వీసులూ రెండు నెలల పాటు రద్దయ్యాయి. దేశంలో లాక్‌డౌన్ విధించడంతో మార్చి నెలాఖరు నుంచి మే నెల 25 వరకూ దేశీయ విమానయాన రంగం తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. అన్‌లాక్ నిబంధనలతో మే నెల చివరి నుంచి తిరిగి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సెప్టెంబరు నెలతో పోలిస్తే అక్టోబరులో 33 శాతం వృద్ధి నమోదైనట్లు ఇండియన్ క్రెడిట్ రైజింగ్ ఏజెన్సీ(ఇక్రా) అభిప్రాయపడింది.
తెలంగాణ ప్రభుత్వం హజ్ యాత్రీకుల కోసం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. హజ్ యాత్రీకుల కోసం హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌజ్‌లో అన్‌లైన్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌ను హోంమంత్రి ప్రారంభించారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కొంతమేర ఖర్చులు చెల్లిస్తున్నామన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని.. లాటరీ విధానంలో యాత్రికులను ఎన్నుకుంటామని హోంమంత్రి వివరించారు.
తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున శనివారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి-విస్తరణపై చర్చ జరిగింది. రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగులు పునఃప్రారంభించాలని కేసీఆర్ అన్నారు. థియేటర్లు కూడా ఓపెన్ చేయాలి. అప్పుడే చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతికే కుటుంబాలు కష్టాల నుంచి బయటపడతాయని కేసీఆర్ తెలిపారు.
ఆస్ట్రేలియాతో జరిగే ఆఖరి రెండు టెస్టులకు టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. అతడి సతీమణి అనుష్కశర్మ జనవరిలో ప్రసవించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఆమె వద్దే ఉండేందుకు అతడు పితృత్వపు సెలవులు తీసుకొంటాడని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఇప్పటి కోహ్లీ మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఈ విషయం బోర్డుకు చెప్పలేదు.
సాంకేతిక అభివృద్ధి మానవ జీవన గమనాన్ని సులభతరం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఆఈ), మెషిన్ లెర్నింగ్ (ంళ్) సాయంతో ఖాతాదారులకు మరింత చేరువ అయ్యేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే హెచ్‌ఎస్‌బీసీ తన శాఖలో పెప్పర్ రోబోను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ రోబో బ్యాంకుకు వచ్చే ఖాతాదారుడిని ఆహ్వానించి అసిస్టెంట్‌గా ఏం కావాలో తెలుసుకుంటుంది. రోబోకు సాంకేతికత సాయంతో ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్‌ను అదనంగా జోడించడంతో మరింత మెరుగ్గా భావ వ్యక్తీకరణ చేస్తుంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ పూర్తికాగా.. శనివారం మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా సమాప్తమైంది. తుది విడత ఎన్నికల్లో సాయంత్రం 5గంటల వరకు 55.22% పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6గంటల సమయానికి క్యూలైన్లలో వేచి ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్ శాతం మరింతగా పెరిగే అవకాశం ఉంది.
* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 80,082 కరోనా పరీక్షల నిర్వహించగా.. 2,367 కొత్త కేసులు నిర్ధారణ కాగా.. 11 మంది బాధితులు మృతి చెందారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,40,730కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,779 మంది కొవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.
* ప్రజాప్రతినిధులను ఎన్నుకొన్న తర్వాత వారు సరిగా పనిచేయకపోతే వచ్చే ఎన్నికల్లో వారిని ఓడిస్తారు ప్రజలు. కానీ అందుకోసం ఐదేళ్లు లేదా వారి పదవీ కాలం పూర్తయ్యేంతవరకు వేచి ఉండాలి. అంతేగానీ మధ్యలో పదవి నుంచి తప్పించలేం. అయితే హరియాణాలో మాత్రం ఇకపై సర్పంచుల పనితీరు నచ్చకపోతే వారిని పదవీకాలం మధ్యలోనే అధికారం నుంచి తొలగించొచ్చట. ఈ మేరకు పంచాయతీ రాజ్ సవరణ బిల్లుకు ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదముద్ర వేసింది.
* బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. మూడు దశల ఎన్నికలు నేటితో ముగిసిన నేపథ్యంలో ఆయా సంస్థలు తమ సర్వే వివరాలు వెల్లడించాయి. టైమ్స్‌నౌ- సి ఓటర్, పీపుల్స్ పల్స్, ఏబీపీ న్యూస్, రిపబ్లిక్ జన్‌కీ బాత్ వంటి సంస్థలు మహా కూటమికి ఆధిక్యం కట్టబెట్టాయి. మహా కూటమికి 120, అధికార ఎన్డీయేకు 116 సీట్లు, ఎల్జేపీకి 1, ఇతరులకు 6 స్థానాలు వస్తాయని టైమ్స్‌నౌ- సి ఓటర్ పేర్కొంది. ఇక పీపుల్స్ పల్స్ సైతం మహా కూటమివైపే ఓటర్లు మొగ్గినట్లు చూపించింది. ఆ కూటమికి 100-115 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఎన్డీయేకు 90-110 స్థానాలు రావొచ్చని పేర్కొంది. ఎల్జేపీ 3-5, ఇతరులు 8-18 స్థానాలు దక్కించుకుంటాయని పేర్కొంది. ఇక ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో తేజస్వి యాదవ్‌కు 44 శాతం మంది మద్దతు తెలపగా.. నీతీశ్ కుమార్‌కు 35 శాతం మద్దతు లభించింది. చిరాగ్ పాస్వాన్‌కు 7 శాతం మంది ఓటేశారు.
* తమ వారసుల విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర మంత్రి అమిత్ షా మధ్య మాటల తూటాలు పేలాయి. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రిని చేయాలని మమత తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని షా విమర్శించగా.. బీసీసీఐలో కీలక పదవిలో జయ్‌షా ఏ అర్హతతో కూర్చున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఎత్తి చూపారు. బెంగాల్‌లో భాజపాను అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో..పార్టీని బలోపేతం చేసేందుకు అమిత్ షా ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పర్యటించారు.
* నాంపల్లిలోని భాజపా ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్ తదితరులు హాజరయ్యారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అవలంభించాల్సిన విధానం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికపై సమీక్షతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై భాజపా ముఖ్యనేతలు చర్చించనున్నారు.
* తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అక్రమ కేసులు పెట్టి తనను వేధిస్తున్నారని, ముఖ్యమంత్రి జగనే తనను కాపాడాలని వైకాపా బహిష్కృత నేత సందీప్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. రెండ్రోజుల క్రితం గుంటూరులో మీడియా సమావేశం పెట్టి ఎమ్మెల్యే శ్రీదేవిపై శృంగారపాటి సందీప్, సలివేంద్రం సురేష్ ఆరోపణలు గుప్పించారు.
* బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ పూర్తికాగా.. శనివారం మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా సమాప్తమైంది. తుది విడత ఎన్నికల్లో సాయంత్రం 5గంటల వరకు 55.22% పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6గంటల సమయానికి క్యూలైన్లలో వేచి ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్ శాతం మరింతగా పెరిగే అవకాశం ఉంది. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 28న 71 స్థానాలకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో 54.70శాతం పోలింగ్ నమోదు కాగా.. నవంబర్ 3న 94 స్థానాలకు జరిగిన రెండో విడతలో 55.70% పోలింగ్ నమోదైంది. అలాగే, ఈ రోజు వాల్మికినగర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5గంటల వరకు 52.08శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఆఖరి దశలో 2 కోట్ల మందికి పైగా ఓటర్లు 1,200 మందికి పైగా అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌లో పురారియా నియోజకవర్గంలో అత్యధికంగా 55.50శాతం నమోదైంది. ఈ నెల 10న బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి.
* దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. గత కొంతకాలంగా కేసుల్లో తగ్గుదల కనిపించినప్పటికీ తాజాగా మరో 50,357 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కోరల్లోంచి బయటపడి కోలుకున్నవారి సంఖ్య అధికంగా ఉండటం సానుకూలాంశంగా ఉంది. గత 24గంటల్లో 50,356 కొత్త కేసులు రాగా.. 53,920 మంది కోలుకొని డిశ్ఛార్జి కావడం గమనార్హం. దాదాపు గత ఐదు వారాలుగా దేశంలో ఇదే ట్రెండ్ కొనసాగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో భారత్‌లో క్రియాశీల కేసుల్లో (యాక్టివ్ కేసులు) తగ్గుదల కనబడుతున్నట్టు పేర్కొంది. అక్టోబర్ తొలి వారం నాటికి దేశంలో సగటున 73వేల కేసులు ఉన్నప్పటికీ ఆ సంఖ్య 46వేలకు తగ్గుతూ వచ్చింది. కానీ శుక్రవారం మళ్లీ కేసులు పెరగడంతో దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5,16,632కి చేరింది.
* ప్రపంచంలోని ప్రతి దేశానికి ప్రత్యేకమైన రాజ్యాంగం.. చట్టాలున్నాయి. దేశ ప్రథమ పౌరుడి నుంచి సాధారణ వ్యక్తుల వరకూ అందరూ చట్టాలకు లోబడే వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరూ వాటిని ఉల్లంఘించడానికి వీల్లేదు. ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా పదవి నుంచి తొలగించి శిక్షలు వేయొచ్చని చట్టంలోనే ఉంటుంది. కానీ, బ్రిటన్ రాయల్ కుటుంబం మాత్రం ఆ దేశ చట్టాలకు అతీతులు. కొన్ని అంశాల్లో బ్రిటన్ రాణి ఎలిజెబెత్, ఆమె కుటుంబం చట్టాల ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం లేదు. వారికి కొన్ని చట్టాలు అసలు వర్తించవు.