Politics

తెదేపా వలనే తెలంగాణాకు అమెజాన్!

తెదేపా వలనే తెలంగాణాకు అమెజాన్!

తెలుగుదేశం పార్టీ (తెదేపా) దూరదృష్టి వల్లే అమెజాన్‌ వంటి సంస్థలు నేడు హైదరాబాద్‌కు వస్తున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్ తెదేపా నేతలతో చంద్రబాబు ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో తెదేపా పాత్రను వివరిస్తూ గ్రేటర్‌ ఎన్నికలకు సిద్ధం కావాలని నేతలకు సూచించారు. అభివృద్ధి చేసిన చోట ఓటు అడిగే హక్కు తెదేపాకు ఉంటుందని అన్నారు. వర్షాలతో నష్టపోయిన పేదలను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పోరాడాలన్నారు. డివిజన్ల వారీగా పట్టున్న నాయకులను ఆహ్వానించి ఎన్నికలకు ప్రణాళిక రూపొందించాలని చంద్రబాబు నేతలకు సూచించారు.