విజయంతొ దోబూచులాడి, ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుని అలరించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం ఎట్టకేలకు వెలువడినట్లే ఉంది. శనివారం ఉదయం 10:30నిముషాలకు CNN, USAToday, Associated Press తదితర సంస్థలు జో బైడెన్ 2020 అధ్యక్ష ఎన్నికల విజేతగా ప్రకటించాయి. కమలా హ్యారిస్ మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగానే గాకా తొలి నల్లజాతీయురాలిగా ప్రసిద్ధికి ఎక్కారని కొనియాడాయి. పెన్సిల్వేనియా రాష్ట్ర 20 ఎలక్టోరల్ ఓట్లు బైడెన్ ఖాతాలోకి వేసిన CNN ఆయనకు 273 సీట్లు లభించాయని పేర్కొంటూ ఆయన్ను 2020 అధ్యక్ష ఎన్నికల విజేతగా ప్రకటించింది. మరోవైపు Associated Press బైడెన్ ఖాతాలో 284 సీట్లు జేర్చి ఆయన్నే అధ్యక్షుడిగా ప్రకటించాయి. అయితే ఈ రెండు సంస్థలు ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే కట్టబెట్టాయి. బైడెన్ గెలుపుపై ట్రంప్ కోర్టులు, న్యాయపరమైన చర్యలకు ఎలా ఉపక్రమిస్తారనేది వేచి చూడాల్సిందే.
https://apnews.com/article/Biden-Trump-US-election-2020-results-fd58df73aa677acb74fce2a69adb71f9