ఆలివ్ ఆయిల్ అందులోనూ ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనెలోని మోనో అన్ శాచ్యురేటెడ్ ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వుల్ని పెంచి, హానికర కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా హృద్రోగాల నివారణకు తోడ్పడతాయన్నది తెలిసిందే. అయితే ఆ నూనె నాడీ సంబంధ సమస్యల్నీ ముఖ్యంగా ఆల్జీమర్స్‌నీ అడ్డుకుంటుందని ఫిలడెల్ఫియాలోని టెంపుల్ యూనివర్సిటీ నిపుణుల బృందం నిర్వహించిన తాజా పరిశోధనల్లో తేలింది. ఇందుకోసం వీళ్లు చేసిన కొన్ని పరిశీలనల్లో- శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు- వయసుతోబాటు వచ్చే మతిమరపునీ తగ్గించాయట. అంతేకాదు, మెదడులోని హానికర పదార్థాలను సైతం నివారిస్తూ న్యూరాన్ల మధ్య అనుసంధానం ఏర్పడేలా చేస్తున్నట్లు కూడా గుర్తించారు.మధ్యధరాతీరవాసుల్లో ఆల్జీమర్స్ సమస్య తక్కువగా ఉండటానికి కారణం కూడా ఆలివ్ నూనె వాడకమే కావచ్చు అనీ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి కూరలూ సలాడ్ల తయారీలో దీన్ని వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది అని చెబుతున్నారు.
ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌తో బోలెడు ప్రయోజనాలు
Related tags :