Movies

దేవసేనగా మెహ్రీన్!

దేవసేనగా మెహ్రీన్!

అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి… అనుష్క కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిపోయిన సినిమాలివి. అందరు హీరోయిన్లకు దక్కే అవకాశాలు కావివి. ఈ సినిమాలతో హీరోయిన్లలో ఒక లెజెండరీ స్టేటస్ తెచ్చేసుకుంది అనుష్క. అందుకే ఆమె చాలా మంది హీరోయిన్లకు రోల్ మోడల్ అయిపోయింది. యంగ్‌బ్యూటీ మెహరీన్ సైతం అనుష్కే తనకు స్ఫూర్తి అని అంటోంది. ఆమె చేసిన పాత్రలు తనకెంతో ఇష్టమని చెబుతోంది. అనుష్క పాత్రలలో మీకేది ఇష్టమని అడిగితే… “బాహుబలి చిత్రంలోని దేవసేన పాత్ర చేయాలని ఉంది. ఎప్పుడైనా అలాంటి క్యారెక్టర్ చేసే అవకాశం వస్తే మాత్రం నా అంత సంతోషించే వాళ్లు మరొకరు ఉండరు”అని చెప్పింది మెహరీన్.