Movies

దక్షిణాది వాళ్లకి నడుం పిచ్చి

దక్షిణాది వాళ్లకి నడుం పిచ్చి

తనను స్టార్‌ హీరోయిన్‌గా నిలబెట్టిన తెలుగు చిత్రపరిశ్రమపై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది వాళ్లు నడుం మత్తులో ఉంటారనీ, మిడ్‌ డ్రెస్‌లలోనే నాయికల్ని చూడాలనుకుంటారనీ శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పూజ చెప్పారు. హీరోలకు సమానంగా హీరోయిన్లకు పారితోషికం ఇవ్వాలని కూడా ఆమె డిమాండ్‌ చేశారు. ఆమె వ్యాఖ్యలు నెట్టింట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. దక్షిణాది సినిమాల వల్ల హీరోయిన్‌గా రాణిస్తూ డబ్బులు సంపాదిస్తున్న పూజ ఇలా మాట్లాడడం తగదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దక్షిణాదిని కించపరిచే బదులు ఎక్స్‌పోజింగ్‌ పాత్రలు చేయకుండా ఉండాలని హితవు పలుకుతున్నారు. తెలుగు ఆడియన్స్‌ స్టార్‌ హీరోయిన్‌ హోదా ఇచ్చినందుకు వాళ్లకు పూజ తగిన గుణపాఠం చెప్పారనీ, ఇక తెలుగు ఇండస్ర్టీని వదిలి వెళ్లిపోమ్మని ఘాటుగా కామెంట్లు చేశారు. అయితే దీనిపై పూజా ఇంకా స్పందించలేదు. ఇదే ఇంటర్వ్యూలో ఇలా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు పూజ.