తానా ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన నిరుపేద, అనాధ విద్యార్థులకు విద్యనభ్యసించడం నిమిత్తం చేపట్టిన “చేయూత” కార్యక్రమం సాగుతోంది. దీనిలో భాగంగా శుక్రవారం నాడు హైదరాబాద్లోని Qhub సమావేశ మందిరంలో కొందరు నగదు మొత్తాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి తానా మాజీ అధ్యక్షుడు నాదెళ్ల గంగాధర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ “తానా చేయూత” కార్యక్రమ సమన్వయకర్త, తానా ఫౌండేషన్ కోశాధికారి వల్లేపల్లి శశికాంత్ సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శశికాంత్ మాట్లాడుతూ ఇప్పటివరకు 160మంది పేద, అనాధ విద్యార్థులకు ఆర్థిక సాయం చేసినట్లు వివరించారు. నేడు కర్నూలుకు చెందిన ఏడుగురు విద్యార్థులకు ₹1లక్ష80వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలుకు చెందిన వ్యాపారవేత్త ముప్పా రాజశేఖర్, హైదరాబాద్కు చెందిన పారిశ్రామికవేత్త గారపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఫిలడెల్ఫియాకు చెందిన తానా కార్యదర్శి పొట్లూరి రవి, పెన్సిల్వేనియా తానా యువ విభాగ సభ్యులు గోపీ వాగ్వాలలు విరాళం అందించినట్లు శశికాంత్ తెలిపారు. సాయం అందుకున్న విద్యార్థుల వివరాలు… కిరణ్, విశ్వనాథ్, తేజస్విని, జగన్ మోహన్, తేజశ్రీ, నందిని, శివాంశ్.
తానా ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు చేయూత
Related tags :