* విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చందాక దుర్గా భవానీని పోలీసు క్వార్టర్స్‌లో శవమై తేలినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి 1 గంటలకు నిద్రపోతున్నప్పుడు తన భార్య దుర్గా భవానీ అభిమానిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భర్త సింహాద్రి ఫిర్యాదు చేసినట్లు సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు.
* కన్న తండ్రి కుమార్తెల గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన దారుణ ఘటన చిట్టాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సర్దార్ జమాల్ తెలిపిన వివరాలప్రకారం మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన మహ్మద్ భార్య, పిల్లలతో కలిసి 15 సంవత్సరాల క్రితం మిర్‌దొడ్డి మండలం మోతె గ్రామానికి జీవనోపాధికోసం వలస వచ్చాడు. మాంసం విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంతకాలంగా కుటుంబ కలహాల వల్ల మహ్మద్ మతి స్థిమితం కోల్పోయాడు. అప్పటి నుంచి కుటుంబంతో సహా దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో నివాసం ఉంటూ సైకోగా ప్రవర్తిస్తున్నాడు.
* గుర్తు తెలియని శవం లభ్యం…..తాడిపత్రి వరాలు తోట సమీపంలోని పాత బ్రిడ్జి నుండి పంప్ హౌస్ కు వెల్లే రహదారిలో గుర్తుతెలియని శవం లభ్యం…విషయం తెలుసుకున్న ఎస్ఐ ఖాజా హుస్సేన్ సంఘటనా స్థలానికి చేరుకొని గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
* గాజువాక శ్రీరామ్ నగర్ లో భవాని(25) అనే యువతి ఆత్మహత్య,గుట్టు చప్పుడు కాకుండా దహన సంస్కరాలకు చేసేందుకు పూనుకున్న కుటుంబ సభ్యులు,విషయం తెలుసుకోని పోస్ట్ మార్టం నిమిత్తం కేజిహెచ్ కు తరలించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
* చెన్నైలోని ఓ ఐటీ సంస్థ కార్యాలయంలో జరిపిన సోదాల్లో భారీగా నల్లదనం గుర్తించారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. దాదాపు రూ.1000 కోట్ల నగదు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
* ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడిలో కొండచరియలు విరిగి పడిన సంఘటన మర్చిపోకముందే అమ్మవారి పాత్ర నివేదన శాల సన్ సైడ్ విరిగి పడింది. భక్తుల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.గత కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరుకున్నా అధికారులు పట్టించుకోలేదు.కొండచర్యలు విరిగిపడిన కొద్దీ రోజుల్లోనే మళ్ళీ గోడలు కూలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
* విదేశీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా అరెస్ట్..నిందితులు విమల్ కుమార్, వర్రీప్రసాద్ అరెస్ట్..రద్దయిన టర్కీ నోట్లును చలామణి చేస్తున్న ముఠా..భారత్ కరెన్సీలో రూ.43 కోట్లు విలువైన కరెన్సీ స్వాధీనం..రంగురాళ్లు విక్రయిస్తున్న మరో ముఠా అరెస్ట్..రూ.75 వేల విలువైన అన్ పాలిష్డ్ రంగురాళ్లు సీజ్..నిందితులు సాయి కృష్ణ, బాబూరావు సహా నలుగురు అరెస్ట్..
* విశాఖ అరకు సర్కిల్ పరిధిలో భారీగా గంజాయి పట్టివేతరూ కోటి విలువ చేసే వెయ్యి కేజీల గంజాయి స్వాధీనం – 12 మంది అరెస్టు – బొలోరో జీప్ సీజ్విశాఖ ఏజెన్సీ అరకు లోయలో సర్కిల్ పరిదిలో ఇటీవల కాలం లో భారీగా గంజాయి అక్రమ రవాణా అవుతుంది.దీంతో పోలీస్ లు గట్టి నిఘాను ఏర్పాటు చేసి అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు.దీనిలో భాగంగాగా శనివారం అరకులోయ సర్కిల్ పరిధిలోని డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు గ్రామ సమీపంలో భారీగా గంజాయినీ స్వాధీనం చేసుకున్నారు.ముందస్తు సమాచారం మేరకు లివిటిపుట్టు గ్రామం వద్ద డుంబ్రిగుడ పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా బొలెరో వాహనంలో తరలిస్తున్న 1000 కేజీల గంజాయిని స్వాధీనపర్చుకున్నారు.