కృష్ణాజిల్లా నూజివీడుకి చెందిన వీణ తయారీదారుడు మాబు షేక్‌కు తానా లక్ష రూపాయిల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. వేల వీణల తయారీతో పాటు మరమ్మత్తులు కూడా చేస్తున్న ఈయన సేవలను గుర్తించి ఈ సహకారాన్ని అందజేస్తున్నట్లు కార్యదర్శి పొట్లూరి రవి అన్నారు. అంతర్జాలంలో తానా జాయింట్ ట్రెజరర్ వెంకట్ కోగంటి, రీజనల్ కోఆర్డినేటర్స్ రాజా కసుకుర్తి, సుమంత్ రాం, సతీష్ చుండ్రుల అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వీణా విద్వాన్ సుధాకర్ రాయప్రోలు, శోభా మొక్కపాటి, విజయ నాదెళ్ల, సుధీర్ నారెపలుపు, వెంకట్ సింగు, తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, తానా సాంస్కృతిక సమన్వయకర్త పంత్ర సునీల్ తదితరులు పాల్గొన్నారు. మాబు షేక్ మాట్లాడుతూ వీణ తయారీ వంటి అరుదైన కళను ముందు తరాల వారికి అందించేందుకు ఈ సహకారం ఉపయుక్తమవుతుందని ధన్యవాదాలు తెలిపారు.
నూజివీడు వీణ తయారీదారుడికి తానా ఆర్థిక సాయం
Related tags :