Movies

₹15కోట్లా?

₹15కోట్లా?

చిత్రసీమలో రెమ్యునరేషన్‌కు సంబంధించిన ప్రస్తావన వస్తే ఎక్కువగా హీరోల పేర్లు వినిపిస్తుంటాయి. అత్యధిక పారితోషికాల్ని అందుకుంటున్న వారి జాబితాలో కథానాయికల పేరు వినిపించడం అరుదుగానే జరుగుతుంటుంది. కానీ ఇప్పుడా పరిస్థితులు మారిపోతున్నాయి. హీరోలతో ధీటుగా కథానాయికలు భారీ పారితోషికాల్ని అందుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్‌ చిత్రం ‘పఠాన్‌’ కోసం దీపికా పడుకోన్‌ పదిహేను కోట్ల రెమ్యునరేషన్‌ను అందుకున్నట్లు సమాచారం. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత షారుఖ్‌ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో దీపికా పడుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో అగ్రకథానాయికల్లో ఒకరిగా కొనసాగుతోంది దీపికా. ఆమెకున్న డిమాండ్‌ దృష్ట్యా చిత్రబృందం పదిహేను కోట్ల పారితోషికాన్ని అందించినట్లు సమాచారం. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో జాన్‌ అబ్రహమ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. దాదాపు 200 కోట్ల వ్యయంతో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది.