‘‘నేను యాక్టర్‌ని కాకపోయుంటే కచ్చితంగా లాయర్‌ని అయ్యేదాన్ని. ఎందుకంటే అందరితో ఎక్కువగా వాదిస్తుంటాను’’ అన్నారు హన్సిక. సందీప్ కిషన్, హన్సిక జంటగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్’ అన్నది ఉపశీర్షిక. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ నిర్మించిన ఈ సినిమా రేపు(శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా హన్సిక పలు విశేషాలు పంచుకున్నారు. ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో అమాయకపు లాయర్ పాత్రలో కనిపిస్తాను. ఈ చిత్రంలో మా నాన్న (మురళీ శర్మ) పెద్ద లాయర్. నేను చాలా తెలివైనదాన్ని అని నా ఫీలింగ్. సెక్షన్స్ అన్నీ తికమకగా చెప్పేస్తాను. తెనాలి రామకృష్ణతో తొలుత గొడవ, ఆ తర్వాత ప్రేమలో పడతాను. మేమిద్దరం ఓ కేసుని ఎలా డీల్ చేశామన్నది ఈ చిత్ర కథ. జి.నాగేశ్వరరెడ్డిగారితో ‘దేనికైనా రెడీ’ సినిమా చేశాను. ఆయన సినిమాలు చాలా సరదాగా ఉంటాయి. ఈ సినిమా కూడా అలానే ఉంటుంది. కుటుంబమంతా కలసి నవ్వుతూ థియేటర్స్ నుంచి బయటకు వస్తారు. వరుసగా తమిళ సినిమాలు చేయడంతో తెలుగులో చిన్న గ్యాప్ ఏర్పడింది. కానీ, తెలుగు సినిమా అవకాశం ఎప్పుడు వచ్చినా చేస్తుంటాను. పాత్ర బావుంటే భాషతో నాకు పట్టింపు లేదు. నా పాత్రని ఎలా చేశా అన్నదే ముఖ్యం. ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నా నేను ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వను. నేను చాలా కాన్ఫిడెంట్, సెక్యూర్ యాక్టర్‌ని. కార్ డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ధన్‌తేరస్‌కి మా ఇంటి మహాలక్ష్మికి ఏదో ఒకటి ఇవ్వాలని మా అమ్మగారు నాకు కారును బహుమతిగా కొనిచ్చారు. నెగటివ్ రోల్, కామెడీ చేయడం చాలా కష్టం. అలాంటి పాత్రలు వస్తే అస్సలు వదులుకోను. కెరీర్‌లో 50 సినిమాలు పూర్తి చేశాను. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అని నా భావన. ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి.. అందరూ బావుండాలి అన్నదే నా ఫిలాసఫీ. ప్రస్తుతం తెలుగులో అమే జాన్ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. ‘భాగమతి’ దర్శకుడు అశోక్ డైరెక్టర్. షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం యూత్ ఎలా ఉంది? అనే యాంగిల్‌లో కథ సాగుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ వెబ్ సిరీస్ బయటకు వస్తుంది.
లాయర్ అయ్యేదాన్ని
Related tags :