ప్రవాసీయుల ఫ్యామిలీలకు సంబంధించి సౌదీ అరేబియా సర్కార్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో నివాసం ఉంటున్న ప్రవాస కుటుంబ సభ్యులు తప్పనిసరిగా వేలి ముద్రలు నమోదు చేసుకోవాలని ఆదేశించింది. భద్రతపరమైన కారణాలు, నివాస అనుమతుల కోసం ప్రవాస కుటుంబాల ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తున్నట్లు సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఫర్ పాస్‌పోర్ట్స్ వెల్లడించింది. కనుక ప్రవాస కుటుంబంలో ఆరేళ్లకు పైబడిన వారందరూ తమ వేలి ముద్రలు నమోదు చేసుకోవాలని సూచించింది. ఆరేళ్లు లేదా అంతకుమించి వయసు గల ఫ్యామిలీ మెంబర్స్ బయో-ఫీచర్స్ నమోదు చేసుకోవడం తప్పనిసరి అని ఈ సందర్భంగా ఎజెన్సీ పేర్కొంది. ఇక 34.8 మిలియన్ల జనాభా గల సౌదీ అరేబియాలో విదేశీయులే 10.5 మిలియన్ల మంది ఉన్నట్లు సమాచారం.
సౌదీలో భారతీయుల వేలిముద్రలు తప్పనిసరి
Related tags :