DailyDose

బంజారాహిల్స్‌లో ఆత్మహత్యల కలకలం-నేరవార్తలు

బంజారాహిల్స్‌లో ఆత్మహత్యల కలకలం-నేరవార్తలు

* బంజారాహిల్స్ అంబేడ్కర్ నగర్‌లో ఉద్రిక్తత.అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు వెళ్లిన నగరపాలక సంస్థ సిబ్బంది.నిర్మాణాలు కూల్చొద్దంటూ అడ్డుకున్న స్థానికులు.ఒంటిపై కిరోసిన్ పోసుకుని ముగ్గురు బస్తీవాసుల ఆత్మహత్యాయత్నం.జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై రాళ్లు రువ్విన స్థానికులు, అధికారులతో వాగ్వాదం.ఘటనాస్థలికి చేరుకుని అధికారులు, స్థానికులను పంపించిన పోలీసులు.

* అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో మతిస్థిమితం లేని తండ్రి రవి చేతిలో ఇద్దరు చిన్నారులు ( కవల పిల్లలు) సుదీప్ ,(5) సుధీర్ (5) హతం అయ్యారు.

* నెల్లూరు రూరల్ 31డివిజన్ శ్రామికానగర్, చంద్రబాబు నగర్ నందు రాత్రి కురిసిన వర్షానికి ఇళ్ళు, రోడ్లు, కాలువలు నీటమునిగాయి.

* గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆడియో అంటూ మరోక ఆడియో విడుదల చేసిన సందీప్…అప్పర్ క్యాస్ట్ వాళ్లు మనని వాడుకోంటున్నారంటూ ఫోన్ ఆడియో…ఆడియోలో రెడ్డి సామాజిక వర్గాన్ని తూరుపారపట్టిన శ్రీదేవి.ఎస్సీలు, బిసిలు ఒకటిగా ఉండాలి రెడ్లు అనేవాళ్లు డేంజర్ అంటున్న శ్రీదేవి.స్థానిక నేతలతో తనకు ఉన్న విభేదాలను భయట పెట్టినట్లు ఉన్న ఆడియో.

* కర్నూలు జిల్లా మంత్రాలయం ఇండోర్ స్టేడియంలో క్రికెట్ పిచ్‌పై చేతబడి కలకలం రేపింది.పిచ్‌పై ముగ్గులు వేసి దుండగులు దీపాలు వెలిగించారు.నిమ్మకాయ, పసుపు, కుంకుమ వేసి క్షుద్రపూజలు చేసినట్టు ఆనవాళ్లున్నాయి.ఇక్కడే విద్యార్థులంతా క్రికెట్ ఆడుతుంటారు.భయాందోళనలో స్కూల్‌ విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు.చేతబడి యత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

* ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదని వెలగపూడి గ్రామంలో అమరావతి పారిశుద్ధ కార్మికుల నిరసన ప్రదర్శన.

* గుంటూరు జిల్లా బెల్లంకొండ పెదకూరపాడు మండలం 75త్యాళ్ళూరు కు చెందిన ఊర సురేష్(22), బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన ఊర కొమరయ్య(21)లు క్రికెట్ బెట్టింగులకు పందాలు కాసి నష్టపోయారు.